Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్‌లు

Published on Nov 29 2017 // Movie News

రాజమౌళి, రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీయార్‌ల కలయికలో సినిమా మొదలవుతోంది.ఈ క్రేజీ కాంబినేషన్‌ నిజమే. రాజమౌళి నెక్స్ట్‌సినిమా ఇదే!

కొద్దిరోజుల క్రితం సోషల్‌ మీడియాలో రాజమౌళి… ఈ ఫోటో పెట్టిన దగ్గర నుంచి రకరకాల ఊహాగానాలు. రామ్‌ చరణ్‌, తారక్‌లతో రాజమౌళి మల్టీస్టారర్‌ చేస్తున్నారని కొందరు, కాదు… అది తమాషాగా దిగిన ఫోటోయేనని మరికొందరు చెబుతూ వచ్చారు. ఇప్పుడు నిజం తేలిపోయింది.

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా ఈ భారీ మల్టీస్టారరే! వచ్చే ఆగస్టు నుంచి ఈ క్రేజీ కాంబినేషన్‌ సెట్స్‌ మీదకు వెళుతుందని విశ్వసనీయ సమాచారం. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమా అంటేనే ఊహకు అందనిది.

ఇక వీరిద్దరికీ రాజమౌళి తోడయితే ఇక చెప్పేదేముంది?. మల్టీస్టారర్‌ చిత్రాలకు నిజమైన నిర్వచనంలా నిలిచే విధంగా ఈ సినిమాని రూపొందించాలనే పట్టుదలతో దర్శకుడు రాజమౌళి ఉన్నారు.

ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కోసం ఓ స్టోరీ లైన్‌ తయారు చేశారనీ, అది విని ఇద్దరు హీరోలూ ఇంప్రెస్‌ అయి ఓ.కె. చెప్పేశారనీ సమాచారం.

ఇందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ అన్నదమ్ములుగా నటిస్తారని అంటున్నారు. ఆగస్ట్‌ నుంచి ఈ చిత్రం ప్రారంభం కావచ్చని చెబుతున్నారు.
ఎందుకంటే ఈ సినిమా ప్రారంభమయ్యేలోపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించే సినిమాని రామ్‌చరణ్‌ పూర్తి చేయాలి. అలాగే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించే సినిమా ఉండనే ఉంది. ఇవి రెండూ పూర్తవడానికి ఎంత లేదన్నా ఆరు నెలలు పట్టవచ్చు.

అందుకే ఈలోగా మరో సినిమా జోలికి వెళ్లకుండా ఈ మల్టీస్టారర్‌ మీదే దృష్టి పెట్టాలని రాజమౌళి ఫిక్స్‌ అయినట్లు సమాచారం. మరో పక్క ఈ మల్టీస్టారర్‌ బడ్జెట్‌ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఇద్దరు మాస్‌ హీరోలు తొలిసారిగా కలసి నటించే సినిమా కనుక బడ్జెట్‌ కూడా భారీగానే ఉంటుందని అంటున్నారు.

రూ. 150 కోట్లు ఉండవచ్చని ఓ అంచనా. అలాగే ఈ సినిమాకి నిర్మాత ఎవరనేది రాజమౌళి ఇంకా అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ దానయ్యకే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే తన తదుపరి చిత్రాన్ని దానయ్య నిర్మిస్తారని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు.

Leave a comment