Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

కాంగ్రెస్‌లోకి వరుణ్‌ గాంధీ కోసం ప్రియాంక పావులు

Published on Nov 28 2017 // Politics

కీలక పాత్ర పోషిస్తున్న ప్రియాంక గాంధీ
35 ఏళ్ల తర్వాత దాయాదులు కలుస్తారా?
ఖాయమంటున్న కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు
బీజేపీలో తగ్గిన ప్రాధాన్యం.. వరుణ్‌ అలక
2019 ఎన్నికలలోపే హస్తం గూటికి చేరిక
మేనక అంగీకారమే కీలకమన్న విశ్లేషకులు
బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మేనకా గాంధీ కుమారుడు వరుణ్‌ గాంధీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారా..? 35 ఏళ్ల కిందట విడిపోయిన కుటుంబాలు మళ్లీ ఒక్కటవ్వనున్నాయా..? అంటే ఆ అవకాశం ఉందనే అంటున్నారు కాంగ్రెస్‌ నాయకులు.

అంతర్గత కలహాల వల్ల అత్త ఇందిరతో విభేదించి మేనకా గాంధీ బయటకి రావడంతో చీలిపోయిన ఈ కుటుంబాలు.. ప్రియాంక చొరవతో మళ్లీ ఏకమవ్వనున్నాయా..? అంటే అవుననే సమాధానమిస్తున్నారు వారు.

2019 ఎన్నికల్లోపే ఇది జరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. రాహుల్‌ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన వెంటనే తమ్ముడు వరుణ్‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తారని అభిప్రాయపడుతున్నారు. వరుణ్‌ బీజేపీలో అతి పిన్న వయస్కుడైన కీలక నేత.

సుల్తాన్‌పూర్‌ ఎంపీ. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సమయంలో పార్టీ నేతలు కొందరు వరుణ్‌ గాంధీని సీఎం చేస్తారని భావించారు. కానీ, బీజేపీ అధినాయకత్వం క్రమంగా వరుణ్‌ ప్రాధాన్యాన్ని తగ్గిస్తోందని, ఈ క్రమంలోనే ఆయన తమ పార్టీలో చేరడం దాదాపు ఖాయమేనని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

సూత్రధారి ప్రియాంకేనా..?
వరుణ్‌ కాంగ్రె్‌సలో చేరడం దాదాపు ఖాయమైనట్లేనని యూపీ కాంగ్రెస్‌ నేత హజీ మంజూర్‌ అహ్మద్‌ పేర్కొనట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది. వరుణ్‌ కాంగ్రె్‌సలో పదాధికారిగా చేరే అవకాశం ఉందని అహ్మద్‌ చెప్పడం గమనార్హం.

మరో నేత జమాలుద్దీన్‌ మాట్లాడుతూ బీజేపీలో మోదీని తప్ప మరెవరినీ మాట్లాడనివ్వడం లేదు. అలాంటి మోదీ పాలనపై తమ అభిప్రాయాన్ని ధైర్యంగా చెబుతున్న అతికొద్ది మంది బీజేపీ నేతల్లో వరుణ్‌ ఒకరు. అందుకు ఆయన మూల్యం చెల్లిస్తున్నారు.

పార్టీలో ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించేశారని చెప్పారు. కాగా కాంగ్రెస్‌లోకి వరుణ్‌ వచ్చేలా చేయడంలో ప్రియాంక కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వరుణ్‌తో ఆమె సన్నిహితంగానే ఉంటారని, ఇద్దరి మధ్య కొంత మేరకు సత్సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తమ్ముడితో ప్రియాంక సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇటీవల మోదీ సర్కారు చేపడుతున్న కార్యక్రమాలను వరుణ్‌ ఆక్షేపిస్తున్నారు. బీజేపీ విధానాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అబ్బే.. చేరరు..
మరోవైపు వరుణ్‌ కాంగ్రె్‌సలో చేరే ప్రసక్తే ఉండదని, అందుకు మేనకా గాంధీ అంగీకరించరని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మేనకకు తోడికోడలు సోనియాతో పొసగదని, ఈ నేపథ్యంలో కుమారుణ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రె్‌సలో చేరనివ్వరని తేల్చిచెబుతున్నారు.

Leave a comment