Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

జగన్‌లో విశ్వసనీయత లేదు-ఈశ్వరి

Published on Nov 28 2017 // Politics

టీడీపీ కండువా కప్పిన చంద్రబాబు
అభివృద్ధిని కోరి వస్తున్నవారికి స్వాగతం
విశాఖ జిల్లా పాడేరు గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తన నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన అనుచరులు, వైసీపీ నేతలతో కలిసి ఆమె సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

అనంతరం టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు ఆమెకు పార్టీ కండవా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. అభివృద్ధిని కాంక్షిస్తూ టీడీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం శుభసూచకమని వ్యాఖ్యానించారు.

‘రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రత్యేకించి విశాఖ ఏజెన్సీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.

అభివృద్ధి,సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని చూసి అనేకమంది మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు’ అని చంద్రబాబు అన్నారు.

జగన్‌ గెంటేశారు
గిరిజనులమైనా తమకూ ఆత్మాభిమానం ఉంటుందని, అది దెబ్బతినడం వల్లే వైసీపీని వదిలి టీడీపీలోకి వచ్చామని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు.

‘నేను ఒక గిరిజన మహిళను. ఉపాధ్యాయురాలిగా పనిచేశా. ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి వచ్చా. విశాఖ మన్యంలో బాక్సయిట్‌ వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించాను.

జగన్‌ అంటే నాకు చాలా ఇష్టం. ప్రాణం. ఎమ్మెల్యేగా ఆయన నాకు రాజకీయ భిక్షపెట్టారు. పార్టీలో నేను చాలా కష్టపడి పనిచేశా. 2019లో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదుగానీ.

పాడేరు, అరకుల్లో గెలిచే స్థాయిలో వైసీపీని బలోపేతం చేశా. కానీ, ఇప్పుడు వైసీపీలో పరిస్థితి మారిపోయింది. కోట్లు ఉంటేనే సీట్లని అంటున్నారు.

మన్యంలోని స్థానిక గిరిజనులను కాదని డబ్బులున్నాయన్న కారణంతో మైదాన ప్రాంత గిరిజనులు తెచ్చి మా వద్ద టిక్కెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అరకు వైసీపీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు టీడీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత శెట్టి ఫాల్గుణ అనే బ్యాంక్‌ ఉద్యోగిని తీసుకువచ్చి జగన్‌ అనుమతితో ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పెట్టాను.

నెలకు లక్షన్నర జీతం వదులుకొని అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాడు. కానీ ఆకస్మికంగా కుంభా రవిబాబు అనే స్ధానికేతర గిరిజనుడిని తెర పైకి తెచ్చారు.

ఆయన పార్టీకి రూ.2 కోట్లు ఫండ్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ప్రతి మనిషికి విశ్వసనీయత ఉండాలి. ఇచ్చిన మాట నిలుపుకోవాలి. దానికి భిన్నంగా రవిబాబును తెచ్చారు.

ఇది సరికాదని నేను పార్టీలోని పెద్దలందరికీ చెప్పాను. ఇంత కష్టపడితే ఇదా ప్రతిఫలం అని విరక్తి వచ్చింది. టీడీపీలో చేరాలని నిర్ణయించుకొన్నాను’ అని గిడ్డి ఈశ్వరి వివరించారు. గిరిజనుల మనోభీష్టానికి వ్యతిరేకంగా బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వవద్దని తాను ఒకే కోరికను ముఖ్యమంత్రి ముందు ఉంచానని, నూటికి నూరు శాతం అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన చెప్పారని వెల్లడించారు.

‘‘రూ.25 కోట్లు తీసుకొని పార్టీ మారానని జగన్‌ మీడియాలో రాస్తున్నారు. నేను నిజంగా డబ్బులు తీసుకొని పార్టీ మారితే నాతోపాటు ఇంత మంది గిరిజనులు ఇక్కడకు రారు. జగన్‌ను ప్రాధేయపడినా నిర్ధాక్షిణ్యంగా గెంటి వేయడంతో బయటకు వచ్చాం’ అని ఆమె పేర్కొన్నారు.

తాను ముఖ్యమంత్రిపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశానన్నది నిజం కాదని, గిరిజనుల కోణంలోనే మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనతోపాటు వచ్చిన వారితో పాడేరులో వైసీపీ ఖాళీ అయిందన్నారు.

Leave a comment