Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

మ‌ద్ద‌తుదారుల‌తో గిడ్డి ఈశ్వ‌రి మ‌రోసారి చ‌ర్చ‌

Published on Nov 26 2017 // Politics

విశాఖ‌ప‌ట్నం జిల్లా పాడేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి తెలుగు దేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధ‌మైంది. గిడ్డి ఈశ్వ‌రి క్యాంపు కార్యాల‌యానికి ఆమె అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

ప్రస్తుతం వారితో ఆమె చ‌ర్చిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కానీ, రేపు ఉద‌యం కానీ అమ‌రావ‌తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆమె టీడీపీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి కారణంగానే పార్టీ మార్పు

ప్రజా సంకల్ప యాత్ర పేరిట ప్రజల సమస్యలను తెలుసుకుని, వారికి దగ్గరై, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది.

పార్టీ తరఫున పాడేరు నుంచి ఎన్నికైన గిడ్డి ఈశ్వరి, సోమవారం నాడు సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం నాడు ఆమె స్వయంగా వెల్లడించారు.

విశాఖ జిల్లాలో అభివృద్ధే తనకు ముఖ్యమని, కార్యకర్తల అభీష్టం మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్భంగా ఈశ్వరి వ్యాఖ్యానించారు.

జగన్ పై విమర్శలు చేస్తూ, తాను పార్టీ మారితేనే పాడేరు అభివృద్ధికి బాటలు పడతాయని అన్నారు. కాగా, పార్టీ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న తనలాంటి వారిని జగన్ పక్కనబెట్టడంతోనే మనస్తాపం చెందినట్టు ఈశ్వరి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.

జగన్ పక్కనే తిరుగుతున్న విజయసాయిరెడ్డి కారణంగానే తాను పార్టీ మారవలసి వస్తోందని ఈశ్వరి వ్యాఖ్యానించడం గమనార్హం.
పాడేరు నుంచి విజ‌య‌వాడ బ‌య‌లుదేరిన గిడ్డి ఈశ్వ‌రి అనుచ‌రులు
రేపు విజ‌య‌వాడ‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తా-గిడ్డి ఈశ్వ‌రి
విశాఖ‌ప‌ట్నం జిల్లా పాడేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి రేపు తెలుగు దేశం పార్టీలో చేర‌నున్నారు.

పాడేరులోని త‌న‌ క్యాంపు కార్యాల‌యంలో ఆమె త‌న‌ అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారులతో ఈ రోజు చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. రేపు తాను పాడేరు నుంచి విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరుతున్న‌ట్లు ఆమె ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి వైఖ‌రితో తీవ్ర మ‌నస్తాపానికి గుర‌య్యాన‌ని ఈశ్వరి ఆమె వ్యాఖ్యానించారు. అంతకు మించి మాట్లాడడానికి ఆమె నిరాకరించారు.

రేపు విజ‌య‌వాడ‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని అన్నారు. మ‌రోవైపు ఆమె అనుచ‌రులు పాడేరు నుంచి విజ‌య‌వాడకు బ‌య‌లుదేరుతున్నారు.

Leave a comment