Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!

Published on Nov 21 2017 // News

జీఎస్టీపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇటీవలె జీఎస్టీ పరిధిలోని కొన్ని నిత్యావసర వస్తువులపై పన్ను రేట్లను తగ్గించిన కేంద్రం.

తాజాగా మరికొన్ని వస్తువులపై పన్నులను తగ్గించాలని నిర్ణయించింది. ముఖ్యంగా రోజూవారి వినియోగంలో ఉన్న ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మిషన్లు, తదితరాలపై జీఎస్టీని తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. అదే జరిగితే… ప్రజలకు కాస్త ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ఏసీలు, రిఫ్రిజిరేటర్లు 28 శాతం శ్లాబులో ఉన్నాయి.

దీంతో వాటి ధరలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు వాటిని కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో క్రయవిక్రయాలు లేక.. వ్యాపారులు, తయారీ సంస్థలు దివాలా తీసే పరిస్థితి నెలకొంది.

దీన్ని దృష్టిలో పెట్టుకొని వీటిపై పన్ను రేటు తగ్గించాల్సిందిగా తయారీ సంస్థల ప్రతినిధులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల వినియోగం, వ్యాపారం, ఉపాధిని దృష్టిలో ఉంచుకొని దీనిపై కేంద్రం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా, ఇటీవల 28శాతం శ్లాబులో ఉన్న 178 వస్తువులపై జీఎస్‌టీని తగ్గించిన విషయం తెలిసిందే. నిత్యావసరాలైన షాంపూలు, వాషింగ్‌ పౌడర్‌, మేకప్ కిట్లు‌, చాక్‌లెట్లు, వెట్‌ గ్రైండర్లు, తదితర వస్తువులపై జీఎస్‌టీని 28 నుంచి 18శాతానికి తగ్గించారు. ప్రస్తుతం 28శాతం శ్లాబులో కేవలం 50 వస్తువులే ఉన్నాయి.

Leave a comment