Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

భూమి అంతం 2036లో.. నాసా అంచనా!

Published on Nov 20 2017 // News

నిబిరు అనే ఓ గ్రహం మనవైపు దూసుకొస్తున్నదని, రేపోమాపో భూమి ఇక అంతమవుతుందని కొన్ని రోజులుగా కాన్‌స్పిరసీ థియరిస్టులు లెక్కలేస్తున్న విషయం తెలిసిందే కదా.

ఓ తేదీ చెప్పడం అది దాటితే మరో తేదీ.. ఇలా వీళ్ల సిద్ధాంతాలు, అంచనాలకు విలువు లేకుండా పోయింది. అయితే తాజాగా నాసా కూడా భూమి అంతాన్ని ఊహించింది. ఇప్పుడు కాదుగానీ.. 2036లో ఓ ఆస్టరాయిడ్ ఢీకొని భూమి అంతమవుతుందని నాసా అంచనా వేస్తున్నది.

అపోఫిస్ అనే ఆ ఉల్క.. భూమిని బలంగా ఢీకొనడంతో మానవాళి అంతమయ్యే ప్రమాదం ఉన్నట్లు సాక్షాత్తూ నాసానే చెప్పడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది. 2004లో నాసా ఈ ఉల్కను కనుగొన్నది. 13 ఏళ్లుగా దీనిని పరిశీలిస్తూనే ఉన్నది.

తాజాగా దాని కదలికలను చూసిన తర్వాత 2036లో అది భూమిని ఢీకొంటుందని నాసా ఓ అంచనాకు వచ్చింది. ఐబీ టైమ్స్ అనే పత్రికలో ఈ కథనం వచ్చింది. నాసా అధికారి డునె బ్రౌన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.

నాసా ప్రొపల్షన్ లేబొరేటరీలోని సైంటిస్టులు స్టీవ్ చెల్సీ, పాల్ ఖొడాస్ 2009 నుంచి ఈ ఉల్క గమనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కచ్చితంగా చెప్పాలంటే ఇది 2036, ఏప్రిల్ 13న భూమిని ఢీకొంటుందని వీళ్లు చెబుతున్నారు.

అపోఫిస్ అనే ఈ ఉల్క చాలా ఆందోళన కలిగిస్తున్నదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంప్యుటేషనల్ టెక్నిక్స్, డేటాను విశ్లేసిస్తే అది 2036, ఏప్రిల్ 13న భూమిని ఢీకొంటుందని నాసా తన వెబ్‌సైట్‌లో రాసుకున్నట్లు ఐబీ టైమ్స్ పత్రిక వివరించింది.

అంతకుముందే అంటే 2029లోనూ అపోఫిస్ ఒకసారి భూమికి సమీపంగా రానుంది. భూమికి కేవలం 32 వేల కిలోమీటర్ల దూరం నుంచి అది వెళ్తుందని రష్యా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

ఈ సమయంలో దాని దారిలో కొద్దిపాటి తేడా వచ్చినా అది భూమిని అంతం చేస్తుందని వీళ్లు చెబుతున్నారు. ఇప్పటికే డేవిడ్ మీడ్‌లాంటి కాన్‌స్పిరసీ థియరిస్టులు అక్టోబర్ 15, నవంబర్ 19లలో నిబిరు అనే గ్రహం ఢీకొని భూమి అంతమవుతుందని అంచనా వేసిన విషయం తెలిసిందే.

Leave a comment