Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

అమెరికా సైనికుల గురించి సంచలన నివేదిక

Published on Nov 19 2017 // NRI

అమెరికా భద్రతా దళాలకు సంబంధించిన ఓ ఊహించని వాస్తవాన్ని యూఎస్ రక్షణశాఖా వెల్లడించింది. 2013-16 ఆర్థిక సంవత్సరంలో మిలిటరీలో అనేక లైంగిక దాడి, ఆరోపణలు నమోదయ్యాయి. దాదాపు 20,000 పైగా ఆరోపణలు, ఫిర్యాదులు అందాయి.

ఈ సంచలన నివేదికను పెంటగాన్ రక్షణశాఖా కార్యాలయం వెల్లడించింది. ఈ సమాచారం గత నాలుగు సంవత్సరాలదని పేర్కొంది. అత్యధిక సైనికులు కలిగిన మిలటరీలో మొత్తం 8,294 లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి.

నావీలో 4,788, మెరైన్ కార్ప్స్‌లో 3,400 మరియు ఎయిర్ ఫోర్స్‌లో 8,876 లైంగిక ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో ఇటీవల వరుసగా లైంగిక ఆరోపణలు బయటకొస్తున్నాయి. రాజకీయ, సినిమా, వ్యాపార రంగాలకు చెందిన అనేకమందిపై పలువురు బాధితులు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ అంశాలపై అమెరికాలో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో రక్షణశాఖా నివేదికను విడుదల చేసింది. ఇదివరకు విడుదల చేసిన నివేదికతో పోల్చితే లైంగిక ఆరోపణలు స్వల్పంగా పెరిగాయని నివేదికలో స్పష్టమవుతోంది.

ఈ స్థాయిలో భారీగా ఆరోపణలు వెలువడడం సంచలనంగా మారింది. ఈ అంశంపై అమెరికాలో పెద్ద చర్చనడుస్తోంది. ఇదిలావుండగా అమెరికా మిలిటరీలో సుమారు 1.3 మిలియన్ల మంది సైనికులు ఎల్లప్పుడూ విధుల్లో ఉంటారు.

Leave a comment