Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు

Published on Nov 19 2017 // News

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు 1917 నవంబరు 19న ఆమె నెహ్రూ, కమలాదేవి దంపతులకు జన్మించారు. దేశ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమె 1984 అక్టోబరు 31న సిక్కు ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగారు.

హత్య జరిగిన రోజు చోటుచేసుకున్న పరిణామాలేంటి, ఆమె హత్యోదంతం ఎందుకు ప్రపంచానికి ఆలస్యంగా వెల్లడైందన్న విషయాలు కొద్దిమందికే తెలుసు. అప్పట్లో ఆలిండియా రేడియో, దూరదర్శన్‌ ఉండేవి. ఆకాశవాణి న్యూస్‌ డివిజన్‌కు అధిపతిగా ఉన్న దివంగత రామ్మోహన్‌రావు ఆనాటి పరిణామాలను ఓ సందర్భంలో చెప్పారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఆరోజున అంటే 1984 అక్టోబరు 31 న నేను ఇంట్లో బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తున్నాను. ఇంతలో మా ఇంట్లోని ఆర్‌ ఏ ఎక్స్‌ (ఎమర్జెన్సీ) ఫోన్‌ అదే పనిగా మోగుతోంది. వెంటనే తీశాను. ఆవల వైపు హెచ్‌వై శారదాప్రసాద్‌.. ఆయన ప్రధాని ఇందిరకు సమాచార సలహాదారు.

ఆయన వెంటనే నాతో రామ్మోహనరావ్‌, ప్రధానిపై ఆమె సెక్యూరిటీ గార్డులే కాల్పులు జరిపారు. ఆమె తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి సీరియస్‌.. ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. మిగిలిన సమాచారాన్ని మీరు ఆస్పత్రి డాక్టర్ల నుంచి తీసుకోండి’’అని చెప్పారు.

నేను వెంటనే న్యూస్‌రూమ్‌కు పరిగెత్తాను. ప్రధానిపై కాల్పులు జరిగాయని, ఆమెను ఎయిమ్స్‌కు తరలించారని మాత్రమే బులెటిన్స్‌లో చెప్పాం. ఘటన జరిగిన రోజు రాష్ట్రపతి జైల్‌సింగ్‌ దేశంలో లేరు. హోంమంత్రి పీవీ కూడా లేరు. కేబినెట్‌, హోం శాఖ కార్యదర్శులు కూడా ఢిల్లీలో లేరు. రాజీవ్‌గాంధీ కూడా కోల్‌కతాలో ఉన్నారు.

ఇందిర మరణం తెలిసి కొందరు స్వీట్లు పంచుకున్నారన్న వార్త అల్లర్లకు దారితీసింది. తీవ్రమైన హింస చెలరేగింది. మూడు రోజులపాటు మేం ఆఫీసులోనే ఉం డిపోయాం. దురదృష్టవశాత్తూ రాజీవ్‌ గాంధీ హత్య వార్తను కూడా నేనే వెల్లడించాల్సి వచ్చింది. అప్పటికి నేను ప్రభుత్వంలో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారిగా ఉన్నాను.

అప్పటికే రాజీవ్‌ను తాత్కాలిక ప్రధానిని చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నేను ఉపరాష్ట్రపతి ఆర్‌ వెంకట్రామన్‌ దగ్గరకు వెళ్ళి అడిగాను.

ఆయన ఈ విషయాన్ని నాకు ధ్రువీకరించారు. ఆ సాయంత్రమే ప్రమాణస్వీకారమని చెబుతూ స్వయంగా మా న్యూస్‌రూమ్‌కు వచ్చి రాజీవ్‌ తాత్కాలిక ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారని మా ఆరుగంటల బులెటిన్‌లో వెల్లడించారు.

Leave a comment