Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..

Published on Nov 18 2017 // News

01. అమరావతి నిర్మాణానికి షరతులతో కూడిన అనుమతులిచ్చిన – నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ …
ఆ ఇచ్చేదేదో ఇంకో రోజెప్పుడన్నా ఇయ్యొచ్చు గదరా సామీ – దానిక్కూడా శుక్రారమే దొరికిందా…??

02. ఫూటుగా నీటు తాగి నాటు డాన్సులు చేస్తూ విశాఖలో ఓ స్టారు హోటల్లో సిబ్బందిపై చిందు లేసిన ఇద్దరు – ఎమ్మెల్యేలు…
పేర్లు రాసే దమ్ము ఒక్కడికి లేకపాయే – ఇంతోటి దానికి పెతోడూ…. మాదే తోపు ఛానెళంటూ ఊకదంపుడు దేనికిరయ్య…??

03. బన్సాలీ తీసిన పద్మావతి సినిమాని నిషేధించాలంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు …
పద్మావతి పేరే ఆళ్ళ అభ్యంతరం ఐతే – యాపీగా టైటిలుని ఏ ఎంకటలక్ష్మనో మార్చి రిలీజ్జేస్తే సరి – ఏ గొడవా ఉండదు…!!

04. ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తున్న మద్యం దుకాణాలని మూసివేయాలంటూ ఆందోళన చేపట్టిన – విజయ నగరం మహిళలు …
తల్లి మాలచ్ఛిమిలు – అక్కడక్కడా అప్పుడప్పుడూ కాకుండా రాష్ట్రం – కుదిరితే దేశం మొత్తం ఒకేసారి ఒకేరోజు మొదలెట్టండమ్మ – సంపూర్ణ సహాకారం అందిస్తాం…!!

05. ఇవాంకా ట్రంప్ వస్తున్నందునే నగరంలో రోడ్లు బాగు చేస్తున్నామని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అంతా అసత్యం – కేటీఆర్ …
ఎలక్షన్లు దగ్గరపడతన్నాయి కదా – ఇప్పుడు మొదలెడితే గానీ అప్పటికి పూర్తికావని – అంతేగా…??

Leave a comment