Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

హెచ్‌1బీ బిల్లుకు అమెరికా ఆమోదం

Published on Nov 17 2017 // NRI

కనీస వేతనం పెంపునకు అమెరికా కాంగ్రెస్‌ కమిటీ పచ్చజెండా
వీసాలపై ఆధారపడే సంస్థలకు కఠిన నిబంధనల ప్రతిపాదన

హెచ్‌1బీ వీసాదారుల కనీస వేతనాన్ని పెంచుతూ సిద్ధంచేసిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న కనీస వార్షిక వేతనం రూ.39.15 లక్షలు (60,000 డాలర్లు)ను రూ.58.73 లక్షలు (90,000 డాలర్లు)గా పెంచేందుకు దీనిలో ప్రతిపాదనలు చేశారు.

అంతేకాదు వీసా నిబంధనలు కఠినతరం చేసేందుకూ చర్యలను ప్రతిపాదించారు. ఈ వీసాలకు భారత ఐటీ నిపుణుల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే.

అమెరికా ఉద్యోగుల స్థానాన్ని వీరితో భర్తీచేయకుండా తాజా బిల్లులో ఆంక్షలు సిద్ధం చేశారు. అమెరికా ఉద్యోగాల పరిరక్షణ, పెంపు బిల్లు(హెచ్‌ 170) పేరిట ఈ బిల్లును రిపబ్లికన్‌ చట్టసభ సభ్యుడు డారెల్‌ ఇస్సా ప్రవేశపెట్టారు.

దీన్ని న్యాయ వ్యవహారాల కమిటీ ఆమోదించింది. తదుపరి చర్యల నిమిత్తం కాంగ్రెస్‌కు పంపుతారు. అనంతరం అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదముద్ర పడితే ఇది చట్టరూపం దాలుస్తుంది. డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ చట్టసభ్యులు, శ్వేతసౌధ ప్రతినిధుల మధ్య విభేదాల నడుమ.. కాంగ్రెస్‌ ఈ బిల్లుకు ఆమోదం తెలపడం కష్టమేనని నిపుణులు అంచనావేస్తున్నారు.

అమెరికా కార్మికుల స్థానంలో హెచ్‌1బీ వీసాదారులను తీసుకునేందుకు కొన్ని సంస్థలకు ఇచ్చే సడలింపులను తాజా బిల్లులో ఎత్తివేశారు. హెచ్‌1బీ వీసాలపై ఆధారపడే ఉద్యోగ సంస్థలు మొదటగా అమెరికా ఉద్యోగులను నియమించేలా దీనిలో చర్యలు ప్రతిపాదించారు.
అమెరికా వ్యాపారాలకు నష్టం: నాస్కామ్‌
బిల్లులోని నిబంధనలు అమెరికా వ్యాపారాలకు నష్టం కలిగించేలా ఉన్నాయని నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌ చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే కార్యక్రమానికి సంకెళ్లువేస్తున్నారని చెప్పారు.

అయితే హెచ్‌1బీ వీసాలు దుర్వినియోగం కాకుండా చూసేందుకే తాజా బిల్లును సిద్ధంచేసినట్లు ఇస్సా వివరించారు. అమెరికా ప్రయోజనాలు, కార్మికుల శ్రేయస్సుకే వలసల విధానాలు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని న్యాయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ బాన్‌ గూడ్లట్‌ వ్యాఖ్యానించారు.

Leave a comment