Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ముగాబే చుట్టు ఉన్న నేరస్థులే లక్ష్యం- సైన్యం

Published on Nov 15 2017 // National

జింబాబ్వే సైన్యం అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిందన్న వార్తలు తాజాగా కలకలం రేపుతున్నాయి. అయితే సైన్యం దీనిపై వివరణ ఇచ్చింది.

తాము ఎలాంటి తిరుగుబాటుకు ప్రయత్నించలేదని బుధవారం ఉదయం అక్కడి అధికారిక మీడియాలో సైన్యం వెల్లడించింది.

అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే చుట్టు ఉన్న క్రిమినల్స్‌ను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్‌ చేపడుతున్నామని వివరించింది.
ఈ చర్యతో ప్రభుత్వాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకున్నట్టు కాదని ఆర్మీ జనరల్‌ ఒకరు తెలిపారు. ‘అధ్యక్షుడు ముగాబే, ఆయన కుటుంబం క్షేమంగా ఉంది.

వారి రక్షణకు మేం హామీ ఇస్తున్నాం. అధ్యక్షుడి వెంట ఉండి నేరాలకు పాల్పడుతున్న క్రిమినల్స్‌నే మేం టార్గెట్‌ చేశాం. మా లక్ష్యాన్ని సాధించిన వెంటనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నాం’ అని తెలిపారు.

మంగళవారం అధ్యక్షుడి ప్రైవేటు నివాసం చుట్టూ భారీగా సైనిక వాహనాలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో కాల్పులు కూడా చోటుచేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

దీంతో అధ్యక్షుడిపై సైన్యం తిరుగుబాటుకు యత్నించిందని వార్తలు గుప్పుమన్నాయి. బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం వచ్చిన 1980 నుంచి నేటి వరకూ జింబాబ్వేలో ముగాబే పాలన కొనసాగుతోంది.

ఇటీవల 93 ఏళ్ల అధ్యక్షుడికి, సైన్యానికి మధ్య వివాదాలు ముదిరాయి.
ముగాబేకు చెందిన జాను-పీఎఫ్‌ పార్టీ.. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కాన్‌స్టాంటినో చివేంగాపై తీవ్ర ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Leave a comment