Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ట్రంప్‌ మరణశిక్షకు అర్హుడు-ఉత్త‌ర కొరియా

Published on Nov 15 2017 // National

అమెరికా, ఉత్తరకొరియా మధ్య పచ్చిగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరు దేశాధ్యక్షులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఉత్తరకొరియా విమర్శలు చేసింది.

తమ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించింది. ట్రంప్‌ మరణశిక్షకు అర్హుడని కొరియా సరిహద్దులో పర్యటన రద్దు చేసుకున్న పిరికివాడని ఉ.కొరియా పత్రిక రొడొంగ్‌ సిన్‌ముణ్‌ తన కథనంలో పేర్కొంది.

ఇటీవల ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్‌ దక్షిణకొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కిమ్‌ జోంగ్‌ ఉన్‌పై విమర్శలు చేశారు.

దీనిపై ఉత్తరకొరియా తీవ్రంగా స్పందించింది. ట్రంప్‌ దక్షిణ కొరియా పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘మా దేశ నాయకుడిపై విమర్శలు చేస్తూ ఆయనను అవమానించడం తీవ్ర నేరంగా పరిగణిస్తాం. క్షమాభిక్ష కూడా లేనంత పెద్ద నేరం అది.

అందువల్ల ఆయన మరణశిక్షకు అర్హుడు’ అని ఉత్తరకొరియా తన కథనంలో పేర్కొంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి తమ నేతని అవమానిస్తూ మాట్లాడుతున్నారని పత్రిక ఆరోపించింది.

ఉత్తరకొరియా, దక్షిణకొరియా మధ్య ఉన్న సరిహద్దుకు కూడా రావడానికి భయడిన ట్రంప్‌ పిరికివాడని పేర్కొంది.

Leave a comment