Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఐరోపా దేశాల ఎన్నికల్లో పుతిన్ జోక్యం-బ్రిట‌న్

Published on Nov 15 2017 // National

బ్రిటన్ ప్రధాని థెరిసా మే తీవ్ర ఆరోపణలు

ఐరోపా దేశాల ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జోక్యం చేసుకుంటున్నారని, పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా బూటకపు కథనాలను వండి వారస్తున్నారని బ్రిటన్ ప్రధాని థెరిసా మే తీవ్ర ఆరోపణలు చేశారు.

లండన్‌లో జరిగిన లార్డ్ మేయర్ విందులో ఆమె రష్యాపై ధ్వజ మెత్తారు.

బ్రిటన్‌తోపాటు పలు ఐరోపా దేశాల గగనతలా న్ని రష్యా పలుమార్లు ఉల్లంఘించిందన్నారు. పలుమార్లు సైబర్ గూఢచర్యంతో ఇంటర్నెట్ కార్యకలాపాలకు అడ్డుతగిలిందన్నారు. డెన్మార్క్, జర్మనీ రక్షణమంత్రిత్వ శాఖల వివరాలను హ్యాకింగ్ చేసిందన్నారు.

తమ ప్రభుత్వరంగ మీడియా సంస్థలను అడ్డంపెట్టుకొని బూటకపు కథనాలను, ఫొటోషాప్ చేసిన చిత్రాలను ప్రచురిస్తూ పశ్చిమ దేశాల మధ్య వివాదాల సృష్టికి ప్రయత్నిస్తున్నదన్నారు.

రష్యా కుయుక్తులన్నీ తమకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయని, అది ఎన్ని కుట్రలు చేసినా ఐరోపా ప్రజాస్వామ్యాలు తిప్పికొడుతాయని స్పష్టం చేశారు.

Leave a comment