Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

జైల్లో డేరాబాబా తీరుపై తోటి ఖైదీ..!

Published on Nov 14 2017 // News

సాధ్విలపై అత్యాచారానికి పాల్పడిన కేసుల్లో ఊచలు లెక్కిస్తున్న డేరాబాబా గుర్మీత్ సింగ్.. జైల్లో కూడా తన దర్పాన్ని ఏమాత్రం వదులుకోవడం లేదట!

మంగళవారం రోహ్‌తక్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన రాహుల్ అనే ఓ ఖైదీ.. డేరాబాబా కారాగారవాసంపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఖైదీలంతా ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాల్సిఉండగా… డేరాబాబా ఇప్పటి వరకు కనీసం ముఖం కూడా చూపించలేదని పేర్కొన్నాడు.

ఖైదీలను కలుసుకునేందుకు వచ్చినవారిని నిముషాల్లోనే పంపించివేస్తుండగా.. డేరాబాబాని విజిటర్లకు మాత్రం గంటల కొద్దీ సమయం ఇస్తున్నట్టు రాహుల్ వెల్లడించాడు.

‘‘ఇప్పటివరకు మాలో ఎవరూ డేరాబాబాని చూడలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడని మాత్రమే మాకు తెలుసు. పైగా ఆయన జైల్లోకి అడుగుపెట్టింది మొదలు మాపై చాలా ఆంక్షలు విధించారు.

గుర్మీత్ సింగ్ వచ్చిన దగ్గర్నుంచి ఖైదీలెవరినీ జైల్లో స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదని రాహుల్ పూసగుచ్చినట్టు వెల్లడించాడు.

జైల్లో ఏదైనా పనిచేస్తున్న తామెప్పుడూ చూడలేదనీ… అసలు ఆయనకు ఏదైనా పని అప్పగించారో లేదో అన్నది కూడా తెలియదన్నాడు.

సాధారణంగా ఖైదీలను కలుసుకునేందుకు బయటినుంచి ఎవరైనా వస్తే 20 నిమిషాలకు మించి ఉండనివ్వరనీ.. గుర్మీత్ కోసం వచ్చినవాళ్లు మాత్రం దాదాపు రెండు గంటలకుపైగా ఉంటారని రాహుల్ పేర్కొన్నాడు.

2002లో దాఖలైన రెండు అత్యాచార కేసుల్లో డేరాబాబా గుర్మీత్ సింగ్‌ను దోషిగా తేల్చిన పంచకుల ప్రత్యేక కోర్టు… అతడికి 20 యేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆగస్టులో తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

Leave a comment