Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ప‌డ‌వ ప్ర‌మాదంలో నారాయ‌ణ బందువులు

Published on Nov 14 2017 // News

కృష్ణానదిలో పడవ ప్రమాదంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బంధువులు ముగ్గురు చనిపోయిన వార్త ఆయన్ను కలిచి వేసింది. సంఘటన జరిగిన ఆదివారం సాయంత్రం ఆయన పట్నాలో ఉన్నారు. సీఎం కార్యాలయం అధికారులు, పర్యాటక మంత్రి అఖిలప్రియ ఫోన్‌ చేసి సమాచారమందించారు.

విజయవాడ బందరు రోడ్డులో ఉంటున్న ప్రభుకిరణ్‌.. నారాయణ బావమరిది పోవూరి లక్ష్మీ బాపారావు కుమారుడు. బాపారావు సోదరి వసుమతీదేవి నారాయణ భార్య. ప్రభు గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ప్రొఫెసర్‌. ఈయనకు భార్య హరిత (30), కుమార్తె హస్విక (7) ఉన్నారు. వీరి స్వస్థలం నెల్లూరు జిల్లా కురుగొండ్ల.

కొద్దిరోజుల క్రితమే హరిత నెల్లూరులో ఉంటున్న తల్లి విజయమ్మకు ఫోన్‌చేసి విజయవాడకు పిలిపించింది. ఆమెతో పాటు ప్రభు తల్లి లలితాదేవి (56), బంధువులు బొల్లినేని కుమారి, కుడితపూడి సుగుణమ్మ, ఈశ్వరమ్మ, దారపనేని విజయశ్రీ కూడా వచ్చారు. ఆదివారం కావడంతో హరిత కుమార్తె హస్విక బయటకు వెళ్దామని మారాం చేసింది.

హరిత వాళ్లందరినీ తీసుకుని పవిత్రసంగమం వద్దకు వెళ్లి.. బోటెక్కారు. ప్రమాదంలో అంతా నదిలో మునిగిపోయారు. విజయమ్మతోపాటు కొందరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. లలితాదేవి, హరిత, హస్విక గల్లంతయ్యారు. లలితాదేవి, హరిత మృతదేహాలను సహాయ బృందాలు కనిపెట్టి తీసుకొచ్చాయి.

హస్విక ఆచూకీ తెలిసేదాకా వారిద్దరి మృతదేహాలను తీసుకెళ్లేది లేదని బంధువులు భీష్మించారు. దీంతో అఖిలప్రియ నారాయణకు ఫోన్‌ చేశారు. సిబ్బంది గాలిస్తున్నారని, పాప మృతదేహం దొరికిన వెంటనే తాను స్వయంగా ఇంటి వద్దకు చేరుస్తానని ఆయనకు తెలిపారు.

దీంతో నారాయణ బంధువులకు నచ్చజెప్పి.. లలితాదేవి, హరిత మృతదేహాలను గూడూరుకు తరలించేలా సహకరించారు. కాగా.. పడవ ప్రమాదంలో మరణించిన వారికి నారాయణ ఈ సందర్భంగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వం బోట్లకు అనుమతించి ఉంటే అందుకు జాగ్రత్తలు తీసుకోవలసిందని, అనుమతి లేకుండా బోట్లు తిరిగినా ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. సింగపూర్‌, మలేసియాలాగా టూరిజం అభివృద్ధి చేస్తామని భ్రమల్లో పెట్టి జాగ్రత్తలు తీసుకోకుండా వదిలేశారని ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు

Leave a comment