Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

సినిమా తీసే దమ్ము, ధైర్యం వీరికి లేవు-లక్ష్మిపార్వ‌తి

Published on Nov 14 2017 // News

‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమాను తెరకెక్కిస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి నిప్పులు చెరిగారు.

ఒక మహిళకు పెళ్లైన తర్వాత ఆమెపై కన్న తండ్రికి కూడా అధికారం ఉండదని అలాంటిది తన జీవితం గురించి సినిమా తీయడానికి వీళ్లంతా ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై తాను ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు.

తనకు సంబంధం లేని వ్యక్తులు తన పర్మిషన్ లేకుండానే, తనపై సినిమా తీస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. 25 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి పేరును తన పక్కన చేర్చడం చట్ట విరుద్ధమని ఆమె అన్నారు.

మొదటి నుంచి తనను అడుగడుగునా అడ్డుకుంటున్న వ్యక్తులు, ఎన్టీఆర్ తో తన వివాహాన్ని కూడా అడ్డుకోవాలని చూసిన వ్యక్తులకు తన మాటలు తగులుతాయని చెప్పారు. కేతిరెడ్డిలాంటి వారి వెనకున్న ఆ శక్తులు ఎవరో సమయం వచ్చినప్పుడు చెబుతానని అన్నారు.

అడ్డమైన ఒక వెధవ తన పక్కన మరెవరో పేరు పెట్టి… తన భర్త సమాధి వద్దకు రావడమేంటని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. కేతిరెడ్డి వెనక ఉన్న వ్యక్తులకు ధైర్యం ఉంటే తన ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.

తనకు ఎవరూ లేనప్పుడే వీరందరితో తాను ఒంటరిగా పోరాడానని… ఇప్పుడు తన వెనుక ప్రజలు ఉన్నారని చెప్పారు. సినిమాను తీస్తున్న వ్యక్తులకు అంత సీన్ లేదని. ఒకడేమో అప్పుల్లో ఉన్నాడని, మరొకడేమో ప్లాట్ ఫామ్ వెధవ అని… వీరికి సినిమా తీసేంత దమ్ము, ధైర్యం లేవని అన్నారు.

వీరిని ముందు పెట్టి ఒక వ్యక్తి నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు. ఆ వ్యక్తి ఎవరో బయటకు వచ్చే పరిస్థితిని తాను తీసుకురాబోతున్నానని, లీగల్ గా ముందుకెళతానని చెప్పారు. అమరావతిలో కూడా ఈ సినిమా పోస్టర్లు వేస్తారా? అంటూ మండిపడ్డారు.

ఎన్టీఆర్ ఫొటోలు పెట్టుకునే మీరు ఎన్టీఆర్ భార్యకు అవమానం జరుగుతుంటే మౌనంగా ఎలా ఉంటారని ధ్వజమెత్తారు. తెలంగాణ డీజీపీకి తమ లాయర్ ఇప్పటికే లేఖ ఇచ్చారని… ఏపీ డీజీపీకి కూడా లేఖ ఇస్తానని చెప్పారు.

Leave a comment