Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

మంత్రివర్గంలో’చింతమనేని’కి చోటు ఖాయం…!

Published on Nov 14 2017 // Politics

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలల క్రితం ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల క్యాబినెట్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారట.

గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ కొన్ని కారణాలతో సంపూర్ణంగా జరగలేదని, అప్పట్లో ఆయనపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉందని అందుకే కొందరు అసమర్థులకు కూడా మంత్రి పదవులు వచ్చాయని పార్టీ నాయకులు గత కొంత కాలంగా వ్యాఖ్యానిస్తున్నారు.

నంద్యాల ఉపఎన్నికలకు ముందు జరిగిన మంత్రివర్గ విస్తరణపై అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సమర్థులు,నిజాయితీపరులకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని కులాలు, కోటాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ జరిగిందని ఎక్కువ మంది భావించారు.

‘నంద్యాల’ ఉపఎన్నిక తరువాత ‘చంద్రబాబు’కు ప్రజల్లో ఎంత మద్దతు ఉందో తేటతెల్లం కావడంతో..ఇప్పుడు ఆయన తాను స్వంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారని వారు అంటున్నారు.

అదే సమయంలో మంత్రివర్గంలో ఉన్న అసమర్థులు, అవినీతిపరులను తొలగించి వేసే సమయం కూడా ఆసన్నమైందంటున్నారు. దీనితో పాటు కొందరు సీనియర్లను మంత్రివర్గం నుంచి తప్పించి, వారిని పార్టీ సేవకు వాడుకోవాలని ఆయన భావిస్తున్నారట.

వీరి స్థానంలో యువకులు, సమర్థులైన వారిని మంత్రులుగా తీసుకోవాలని ఆయన నిర్ణయించుకుంటున్నారట.రాబోయే రాజ్యసభ ఎన్నికల నాటికి ఓ సీనియర్‌ మంత్రిని తప్పిస్తారని, ఆయనను రాజ్యసభకు పంపించడం ఖాయమని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు అసమర్థులుగా ముద్రపడినవారిపై కూడా వేటు వేయాలని ఆయన భావిస్తున్నారట.

ముఖ్యంగా గత మంత్రివర్గ విస్తరణ సమయంలో చోటు సంపాదించిన పలువురు మంత్రులపై ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. వీరిలో ఓ మహిళా మంత్రి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ఎమ్మెల్సీలుగా ఉంటూ మంత్రి పదవులు నిర్వహిస్తున్న మరో ఇద్దరిపై కూడా వేటు పడుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో అన్ని స్థానాలు కట్టబెట్టిన ‘పశ్చిమగోదావరి’ జిల్లాపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారని తెలుస్తోంది.

ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీపై అభిమానం తగ్గకపోయినా..పార్టీ నాయకులు,ఎమ్మెల్యేలు, మంత్రులపై ఉన్న అసంతృప్తి పార్టీపై పడుతుందని ఆయన భావిస్తున్నారట. గతంలో ఇక్కడ మంత్రిగా పనిచేసిన ‘పీతల సుజాత’ను తప్పించి ‘జవహర్‌’, పీతాని సత్యనారాయణలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు.

అయితే వారిద్దరూ అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోతున్నారని సిఎం అంటున్నారట. వీరిలో ఒకరిని తప్పించడం ఖాయమని తెలుస్తోంది. ఆ స్థానంలో యువకుడు, సమర్థుడైన ‘చింతమనేని ప్రభాకర్‌’ను నియమిస్తారని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ‘దెందులూరు’ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన ‘చింతమనేని’ సమర్థుడైన,ఉత్సాహవంతుడైన ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్‌గా కూడా పనిచేస్తున్నారు. అనవసర ఆవేశంతో ఆయన కొన్ని తప్పులు చేసి ఉండవచ్చని..అయితే వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన మద్దతుదారులు అంటున్నారు. మంత్రిగా ఆయనకు అవకాశం ఇస్తే గత ఎన్నికల్లో టిడిపి సాధించిన ఫలితాలే మళ్లీ ఈ జిల్లాలో సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు.

పోయినసారి మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం దక్కలేదని తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన ‘చింతమనేని’ని అప్పట్లో ముఖ్యమంత్రి బుజ్జగించారు. తరువాత అవకాశం కల్పిస్తానని అప్పుడు హామీ ఇచ్చారని..ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ‘చింతమనేని’కి మంత్రి పదవి దక్కడం ఖాయమని ఆయా వర్గాలు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. మరి చూద్దాం..ఏమవుతుందో..?

Leave a comment