Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

‘బాబు’ను ‘మోడీ’ శత్రువుగా భావిస్తున్నారా…!?

Published on Nov 14 2017 // Politics

మహాభారతంలో ‘దుర్యోధనుడు’ పాండవులపై అకారణ పగను, కోపాన్ని పెంచుకుని వారిని ఆగర్భశత్రువులుగా పరిగణిస్తుంటాడు. పాండవులు తనకు కీడు చేయకపోయినా..నిత్యం వారిని ఏదోవిధంగా వేధించాలని, సాధించాలని, ఎగతాళిచేయాలని పరితపిస్తూ…వారి పతనాన్ని కోరుకుంటుంటాడు..!

Image result for modi chandrababu naidu

ధర్మపరులైన పాండు తనయులు…దుర్యోధనుడు ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టినా…కక్షసాధించినా, ప్రాణాలు తీయాలని పదే పదే ప్రయత్నించి విఫలమవుతాడు. చివరకు న్యాయంగా రావాల్సిన వాటాను ఇవ్వకుండా నిరాకరించి…పాండవుల చేతిలో ప్రాణాలు కోల్పోతాడు..!

అకారణ ద్వేషం, శత్రుత్వం ‘రారాజు’ను పతనాన్ని కోరింది. అదే విధంగా ప్రస్తుతం…’చంద్రబాబు’పై ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారు. తనకు మేలు చేస్తున్నా..తన ఆదేశాలను పాటిస్తున్నా..’చంద్రబాబు’పై అకారణ ద్వేషం,పగ,కోపంతో కుతకుతలాడిపోతున్నారు

‘మోడీ’. తన కన్నా జూనియర్‌ అయిన ‘మోడీ’ తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు బాధించినా..ఆంధ్ర రాష్ట్ర క్షేమం కోసం పంటిబిగివున ఆ బాధలను భరిస్తున్నారు చంద్రబాబు..! అకారణ ద్వేషం, పగ ‘దుర్యోధనుడి’ పతనానికి ఎలా కారణం అయ్యాయా..రేపు ‘మోడీ’ కూడా ఇదేవిధంగా పతనం అవుతానడంలో ఎటువంటి సందేహం లేదు.

వాస్తవానికి ‘మోడీ’ ప్రధానమంత్రి పదవి ఒక రకంగా చెప్పాలంటే ‘చంద్రబాబు’ భిక్షే. అదెలాగంటే…ఎన్‌డిఎ హయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ‘నరేంద్ర’ మోడీ అధికారం వెలగబెడుతున్న సమయంలో సంభవించిన మత ఘర్షణలు ఆయన పదవికి చేటు తెచ్చాయి. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాల్సిందేనని అప్పుడు ప్రధానిగా ఉన్న ‘వాజ్‌పేయి’ గట్టిగా పట్టుపట్టారు.

ఆయన రాజధర్మం పాటించడం లేదంటూ విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఎన్‌డిఎ కన్వీనర్‌గా ఉన్న ‘చంద్రబాబు’ కూడా ‘మోడీ’ని తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలోని ఎపి భవన్‌లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవడానికి ‘మోడీ’ ఎపి భవన్‌కు వచ్చారు. అయితే ‘మోడీ’ కలవడానికి ఇష్టం లేని ‘చంద్రబాబు’ ఇప్పుడు కలవడం కుదరదని చెప్పగా…సాయంత్రం వరకు ఎపి భవన్‌లో ‘మోడీ’ బిక్కు బిక్కుమంటూ గడిపారు.

చివరకు ఎలాగోలా..’చంద్రబాబు’ను కలసి తన పదవి పోకుండా చూడాలని ప్రాధేయపడ్డారు. దీంతో మెత్తబడ్డ ‘చంద్రబాబు’ తరువాత ‘మోడీ’ రాజీనామాపై గట్టిగా పట్టుపట్టలేదు. నాడు ‘చంద్రబాబు’ కనుక గట్టిగా పట్టుపట్టి..ఆయనను తొలగించాల్సిందేనని డిమాండ్‌ చేస్తే…బిజెపి నాయకత్వానికి మరో దారి ఉండేది కాదు. ఎందుకంటే నాటి ఎన్‌డిఎ ప్రభుత్వం టిడిపి మద్దతుతోనే ఢిల్లీ పీఠంపై ఉంది.

‘బాబు’ తలచుకుంటే అప్పట్లో ఆ ప్రభుత్వాన్ని నిమిషాలపై పడగొట్టేవాడు…! లేదా..’మోడీ’ని నిమిషాల్లో తొలగించేవాడు…! కానీ..మానవమాత్రులు చేసిన తప్పులు దిద్దుకుంటారనే ఒకే ఒక్క కారణంతోనే ‘చంద్రబాబు’ నాడు ‘మోడీ’ని వదిలేశారు. ‘చంద్రబాబు’ దయతోనే తరువాత గుజరాత్‌లో వరుసగా గెలుచుకుంటూ ‘మోడీ’ ఢిల్లీస్థాయికి ఎదిగారు..అది వేరే సంగతి..కానీ…! నాడు మేలు చేసిన ‘చంద్రబాబు’పై నేడు ప్రతీకారం తీర్చుకోవాలన్న ‘మోడీ’ కక్షే ఇప్పుడు చర్చనీయాంశం.

అంతెందుకు గత సార్వత్రిక ఎన్నికల్లో ‘చంద్రబాబు’తో పొత్తు కోసం ఎడతెగని ప్రయత్నాలు చేసింది..ఈ మోడీ కాదా..!? మహబూబ్‌నగర్‌ ఎన్నికల సభలో ‘చంద్రబాబు’ చెయ్యిపట్టుకుని కుర్చీలో తన పక్కన కూర్చోబెట్టుకుంది..ఈయన గారు కాదా..? రోజులు మారి పదవిలోకి రావడంతోనే కక్షలు తీర్చుకోవాలన్న కుతి, అవమానించాలన్న ఉద్దేశ్యం ఎవరికీ మంచిది కాదు..!

ఆంధ్రా అభివృద్ధికి అన్ని రకాలుగా అడ్డుపడుతూ, చంద్రబాబును అవమానిస్తున్న ‘మోడీ’కి రానుందని గడ్డుకాలమే. ఇప్పుడు మంద బలంతో చెలరేగిపోతున్న ‘మోడీ’ 2019 ఎన్నికల్లో ఇదే రకంగా ఉండగలుగుతారా..? మెజార్టీ రాకపోతే మళ్లీ ‘చంద్రబాబే’ ఆయనకు దిక్కు…!

ఇవన్నీ వదిలేసి..ఇప్పటికిప్పుడు ‘చంద్రబాబు’ ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చి…వారిపై పోరాటానికి దిగితే…పాండవుల వలే విజయం సాధించకపోతారా..? అప్పుడు ‘మోడీ’ పరిస్థితి భారతంలోని దుర్యోధనుడి వలే ఉంటుందనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా ‘చంద్రబాబు’తో ‘మోడీ’ కోరి ఆగర్భశత్రృత్వం తెచ్చుకోవడం ఆయన కోరి కష్టాలను కొని తెచ్చుకోవడమనడంలో ఎటువంటి సందేహం లేదు.

Leave a comment