Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

పాక్‌లో 23 పార్టీలతో మ‌హ‌కూట‌మి

Published on Nov 13 2017 // National

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్(74) కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేశారు. 23 పార్టీలతో కూడిన ఈ కూటమికి పాకిస్థాన్ అవామీ ఇత్తేహాద్ (పీఏఐ) అనే పేరు పెట్టా రు.

దీనికి ముషార్రఫ్ చైర్మన్‌గా, ఇక్బాల్‌దర్ ప్రధానకార్యదర్శిగా ఉంటారు. ప్రస్తుతం దుబాయ్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ముషార్రఫ్ ఈ సందర్భంగా అక్కడినుంచే వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు.

ముజాహిర్‌వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నిపార్టీలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. చిన్నపార్టీ అయిన ఎంక్యూఎంకు తాను నాయకత్వం వహించనున్నట్లు వార్తలు రావడం హాస్యాస్పదమని అన్నారు. పాకిస్థాన్‌లో పరిస్థితులు ఇప్పుడు మెరుగయ్యాయి కాబట్టి తాను త్వరలోనే స్వదేశానికి వస్తానన్నారు.

కానీ కచ్చితంగా ఎప్పుడన్నది మాత్రం స్పష్టం చేయలేదు. గత ఏడాది మార్చిలో పాక్ అంతర్గత మంత్విత్వశాఖ తన పేరును ఎగ్టిట్ కంట్రోల్ లిస్ట్ నుంచి తొలిగించిన తరువాత ముషార్రఫ్ దేశం విడిచివెళ్లారు. గత ఏడాది ఒక స్పెషల్‌కోర్టు ఆయనపై దేశద్రోహం నేరం మోపింది.

మాజీ ప్రధాని బెనజీర్‌భుట్టో హత్యకేసులో ముషార్రఫ్‌ను తప్పించుకు తిరుగుతున్న ఖైదీగా ప్రకటించారు. తాను దేశానికి తిరిగి వచ్చాక అన్ని కేసులను ఎదుర్కొంటానని ఆయన చెప్పారు.

Leave a comment