Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ఫిలిప్పీన్స్‌లో ఆసియాన్ స్వర్ణోత్సవాలు

Published on Nov 13 2017 // News

-ఇండో – పసిఫిక్‌లో చైనా దూకుడుకు అడ్డుకట్టే లక్ష్యం
-భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా చర్చల్లో అంగీకారం
-ఫిలిప్పీన్స్‌లో ఆసియాన్ స్వర్ణోత్సవాలు.. ట్రంప్‌తో ప్రధాని మోదీ ముచ్చట్లు
-మనాలీకి చేరుకున్న ప్రధాని మోదీ.. ఆసియాన్ సదస్సులో రేపు ప్రసంగం

Modi-trump

ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకునేందుకు భద్రతా రంగంలో పరస్పర సహకారానికి చతుర్భుజ కూటమి ఏర్పాటు చేయాలని అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా నిర్ణయానికి వచ్చాయి.

ఈ మేరకు ఆసియాన్ సదస్సు సందర్భంగా ఆదివారం నాలుగు దేశాల అధికారుల మధ్య జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరింది. ప్రపంచ దేశా ల దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సమగ్ర ఇండో – పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతమైనదిగా తీర్చిదిద్దేందుకు ఆ దేశాల మధ్య అంగీకారం కుదిరింది అని భారత్ విదేశాంగశాఖ తెలిపింది.

ఈ నాలుగు దేశాలు స్వేచ్ఛా వాణిజ్యం పురోభివృద్ధితోపాటు రక్షణ రంగంలో పరస్పరం సహకరించుకోనున్నాయి. ఆసియాన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి ఫిలిప్పీన్స్‌లోని పసాయ్ ఎస్‌ఎంఎక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే విందు ఇచ్చారు.

ఇందులో పాల్గొన్న మోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆప్యాయంగా పలుకరించారు. ట్రంప్‌తోపాటు జపాన్ ప్రధాని షింజో అబెతో ద్వైపాక్షిక సంబంధాలపై సోమవారం ప్రధాని మోదీ చర్చిస్తారు.

చైనా ప్రధాని లీ కియాంగ్, జపాన్ ప్రధా ని షింజో అబె, రష్యా ప్రధాని డిమిట్రీ మెద్వెదేవ్ తదితరులనూ ప్రధాని పలుకరించారు.

బారోగ్ టాగలాగ్ డ్రెస్‌లో దేశాధినేతలు
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లతోపాటు విందుకు హాజరైన వివిధ దేశాల అధినేతలు.. ఫిలిపినో డిజైనర్ అల్బర్ట్ ఆండ్రాడ రూపొందించిన ఒకే తరహా బారోగ్ టాగలాగ్ దుస్తులను ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. పలువురు నేతలతో సమావేశమైన దృశ్యాలను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

నేటి నుంచి ఆసియాన్ సదస్సు
ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు చేరుకున్నారు. కాగా, 1981లో అప్పటి ప్రధాని ఇందిర తర్వాత ఫిలిప్పీన్స్‌లో అడుగు పెట్టిన ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు.

ఫిలిప్పీన్స్‌లోని పాసాయ్‌లో సోమవారం నుంచి గురువారం వరకు జరిగే ఆసియాన్ సదస్సులో మోదీ మంగళవారం ప్రసంగిస్తారు. ఫిలిప్పీన్స్‌లోని భారత సంతతి పౌరులు ఇచ్చే విందుకు ఆయన హాజరవుతారు.

ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ), మహావీర్ ఫిలిప్పీన్స్ ఫౌండేషన్‌లను ప్రధాని మోదీ సందర్శిస్తారు.

Leave a comment