Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

కలప మాఫియాకు సింహస్వప్నం

Published on Nov 13 2017 // News

-20 ఏండ్లుగా పోరాడుతున్న జార్ఖండ్ మహిళ

Jamuna-Tudu
చేతిలో విల్లు, బాణాలు.. గుండెల నిండా ధైర్యం.. ప్రతి చెట్టును కాపాడాలన్న తపన.. వీటినే అస్ర్తాలుగా వాడుతూ ఓ మహిళ 20 ఏండ్లుగా కలప మాఫియాపై పోరాడుతున్నారు. ప్రతి చెట్టును ఓ సోదరుడిలా భావిస్తూ రాఖీ కడుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు.

అడవిలో పుట్టి, పెరిగి.. అడవిపై ఆధారపడి బతుకుతున్న మనమే అడవితల్లిని కాపాడుకోవాలంటూ సాటి మహిళలకు ధైర్యం నూరిపోస్తున్నారు. తోడు వచ్చిన వారితో రక్షణ దళాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒకప్పుడు ఒంటరిగా ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు.. 9,000 మంది అనుచరులకు విస్తరించింది.

జార్ఖాండ్‌లోని ఓ మారుమూల గిరిజన గ్రామానికి ప్రపంచస్థాయి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ మహిళే.. జమున టుడూ. స్థానికులు ఆమెను లేడీ టార్జాన్ అని పిలుస్తుంటారు. ఈ 37 ఏండ్ల మహిళ అక్కడి కలప మాఫియా పాలిట సింహస్వప్నం.

1998 నుంచి మొదలు..
ఒడిశాలో పుట్టిన జమున పెండ్లయిన తర్వాత జార్ఖండ్ తూర్పు ప్రాంతంలోని సింఘ్‌భుమ్ జిల్లా ముటుర్ఖం గ్రామంలో స్థిరపడ్డారు. దాదాపు 50 ఇండ్లు మాత్రమే ఉన్న ఆ గిరిజన గ్రామం చుట్టూ ఉన్న చెట్లపై కలప మాఫియా కన్ను పడింది. ఇష్టం వచ్చినట్టు చెట్లను నరకడం మొదలుపెట్టారు.

అడవి క్రమేపీ అంతమవుతుండడంతో ఎలాగైనా కాపాడాలని జమున నిర్ణయించుకున్నారు. తనతో కలిసి వచ్చిన ఐదుగురితో 1998లో వన్ సురక్షా సమితిని ఏర్పాటు చేశారు. అయితే గ్రామస్థులు వారిని తీవ్రంగా వ్యతిరేకించారు. మాఫియాతో పోరాటం వద్దని, చెట్లను నరుకకుంటే మనకు వంటచెరుకు ఎక్కడి నుంచి వస్తుందని అభ్యంతరం తెలిపారు.

దీంతో చెట్ల ప్రాధాన్యం వారికి మరోసారి గుర్తు చేశారు. అప్పటి నుంచి బాణం, విల్లుల సాయంతో కలప మాఫియాకు ఎదురుతిరుగడం మొదలుపెట్టారు. అటవీ అధికారులకు సైతం సాధ్యంకాని పనిని వన సురక్షా సమితి చేసి చూపింది. పలువురు నేరస్థులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించి కేసులు పెట్టించింది.

9,000 మందితో మూడు బృందాలు
ఒకప్పుడు ఐదుగురు సభ్యులతో ఒక బృందంగా ప్రారంభమైన వన్ సురక్షా సమితి.. ఇప్పుడు 9000 మందితో 300 బృందాలకు విస్తరించింది. వీరివద్ద బాణాలు, విల్లులు, కట్టెలతోపాటు కుక్కలు తోడుగా ఉంటాయి. జార్ఖండ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, జార్ఖండ్ అటవీశాఖ వీరికి సహాయం అందిస్తున్నాయి.

Leave a comment