Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

అమ‌రావ‌తికి మ‌రో ప్రాజేక్టు

Published on Nov 13 2017 // News

నవ్యాంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతోంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు చొరవ ఫలించింది.
జపాన్‌కు చెందిన టయోటా కంపెనీ తాను తయారు చేస్తున్న రెండు హైబ్రిడ్‌ మోడళ్ల కార్లను భారత్‌లో తొలిసారిగా అమరావతిలో లాంచ్‌ చేయనుంది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి 10 ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉచితంగా అందించనుంది. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటారు. ఈ విషయంలో గుజరాత్‌, మహారాష్ట్రలు తీవ్రంగా పోటీ పడినా ఆ అవకాశం ఏపీకి దక్కింది.

గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో తమ రాష్ట్రానికి రావాలని.ఇది ఎన్నికలవేళ లబ్ది చేకూరుస్తుందని పైస్థాయి నుంచి టయోటాతో సంప్రదింపులు జరిగాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు.

అమరావతిని ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రయోగ, ప్రచార కేంద్రంగా ఉపయోగించుకోవాలంటూ చేసిన సూచన, వారితో చేసిన చర్చలు టయోటాను ఏపీవైపు మొగ్గు చూపేలా చేశాయి.

కొద్దిరోజుల క్రితం ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ బెంగళూరు వెళ్లినప్పుడు టయోటా ప్రతినిధులను కలిశారని సమాచారం. ఏపీ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ సీఈవో తిరుమలరావు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు.

ఎలక్ట్రిక్‌ కార్లలో రెండు మోడల్స్‌ ఉన్నాయి. ఇందులో ఒకటి పీహెచ్‌వీ మోడల్‌. సుమారు రూ.40 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 68.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ఇది హైబ్రిడ్‌ కారు. అంటే విద్యుత్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోతే గ్యాస్‌తో కూడా ప్రయాణిస్తుంది. ఈ మోడల్‌కు చెందిన నాలుగు కార్లను టయోటా కంపెనీ ప్రభుత్వానికి అందిస్తుంది. రెండోది కామ్‌ ఎస్‌ మోడల్‌. సుమారు రూ. 9 లక్షల వరకు ఉంటుంది. ఈ మోడల్‌కు చెందిన ఆరు వాహనాలను టయోటా ఏపీకి ఇస్తోంది.

ఏపీలో తయారీ ప్లాంట్‌కు ఆహ్వానం?
టయోటా కార్ల తయారీ ప్లాంట్‌ ప్రస్తుతం బెంగళూరు సమీపంలో ఉంది. భారత్‌కు అవసరమైన వాహనాలను ఇక్కడినుంచే ఉత్పత్తి చేస్తుంది.

అయితే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంట్‌ భారత్‌లో లేదు. జపాన్‌లోని తమ ప్లాంట్‌లో తయారైన ఇ-కార్లను నేరుగా అమరావతికి పంపిస్తుంది.

విదేశీ కార్లను ఇలా తెచ్చుకునేముందు పూణెలోని హోమ్‌లొకేషన్‌ అనే సంస్థ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఆ సంస్థ ధృవీకరించాక కేంద్రం అనుమతి ఇస్తుంది.

ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందన్న ఉద్దేశంతో 2018 డిసెంబరు నాటికి ఇ-వాహనాలు అమరావతికి ఇచ్చేలా ఒప్పందంలో పేర్కొంటారని సమాచారం.

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరగనుందని తెలిసింది. టయోటాతో ఒకసారి బంధం ఏర్పడితే ఆ తర్వాత ఇ-కార్ల తయారీ ప్లాంట్‌ను ఏపీలో పెట్టాలని కోరే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి టయోటా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Leave a comment