Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

బాబు ప్రజలను మోసం చేశారు- జగన్‌

Published on Nov 13 2017 // Politics

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా దివంగత నేత వైఎస్‌ హయాంలోనే జరిగింది. నాన్న మరణం తర్వాత అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదు’’ అని విపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు.

ప్రొద్దుటూరు హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు జగన్‌ పాదయాత్ర ప్రారంభమైంది. రాత్రి 8 గంటలకు దువ్వూరు మండలకేంద్రం రామమందిరం వరకు మొత్తం 16 కిలోమీటర్ల మేర సాగింది.

ఈ సందర్భంగా దువ్వూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ, తాను పాదయాత్ర చేస్తుంటే వేల మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఆదరిస్తున్నారని, కష్టాన్ని లెక్కచేయకుండా తనతో నడుస్తూ ఆప్యాయతను పంచిపెడుతున్నారని అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

పాదయాత్రలో పొలాల్లో నాట్లు పడుతున్న విషయాన్ని గమనించాను. దివంగత నేత వైఎస్‌ ఆగస్టు 20 నుంచి కేసీ కెనాల్‌కు నీరు వదిలే వారు.

ఇప్పుడు నీళ్లు వదులేవారు. ఇప్పుడు నాట్లు పడుతున్నాయి. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఏ ఒక్కసారైనా రెండు పంటలు పండాయా?’’ అని ప్రశ్నించారు.

అదే వైఎస్‌ పాలనలో కేసీ కెనాల్‌ ఆయకట్టులో 2 పంటలు పండిన రోజులున్నాయన్నారు. ప్రస్తుతం క్యాబినెట్‌ సమావేశం నిర్వహించారంటే ఎక్కడ పేదవాడి నుంచి భూములను లాక్కోవాలనే విషయంపైనే ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని విమర్శించారు.

రాజోలి ఆనకట్టను కట్టాలి
కేసీ కెనాల్‌ను స్థిరీకరించేందుకు రాజోలి ఆనకట్టను కట్టాలని జగన్‌ సూచించారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతులు కేసీ నీటిపైనే ఆధారపడ్డారని, 2008లో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు రూ.630 కోట్లతో ఆ ప్రాజెక్టును శాంక్షన్‌ చేశారన్నారు.

నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకునే దిక్కులేకుండా పోయిందన్నారు. గండికోట, సర్వారాయసాగర్‌, వామికొండ ప్రాజెక్టులు కూడా పూర్తికాలేదన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకే పాదయాత్ర చేపట్టానన్నారు.

Leave a comment