Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

జయసుధ ఎక్క‌డున్నారు…

Published on Nov 11 2017 // Movie News

సహజనటి జయసుధ ఎక్కడున్నారు?… ఏం చేస్తున్నారు?.. అనే విషయాలు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల మినహా ఎవ్వరూ చెప్పలేరు.

తన భర్త మరణం తర్వాత జయసుధ మీడియాని ఒక్కటే కోరారు. దయచేసి గుచ్చి గుచ్చి అడగవద్దని. మీడియా కూడా జయసుధను ఇబ్బంది పెట్టలేదు.

అసలే భర్త హఠాత్తుగా చనిపోవడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన జయసుధ, ఎవరు ఏం అడిగినా చెప్పలేకపోయారు. అప్పటి నుండి జయసుధ నటించడం కూడా మానేశారు.

అయితే చాలా కాలం తర్వాత ఆమె హైదరాబాద్‌లో జరగనున్న ఓ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.

నటి గౌతమి క్యాన్సర్‌పై అవగాహన కోసం నిర్వహిస్తున్న లైఫ్ ఎగైన్ విన్నర్స్ వాక్ ఈవెంట్‌లో జయసుధ కూడా పాల్గొనబోతున్నారు.

నవంబర్ 12, ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో జరుగనున్న ఈ వాక్‌లో ఆమె పాల్గొనబోతున్నట్లుగా పోస్టర్‌లు బయటికి వచ్చాయి. ఉదయం 6గంటల 30నిమిషాలకు ఈ వాక్ మొదలవ్వనుంది.

అయితే ఈ మధ్య కాలంలో కెమెరాని ఫేస్ చేయని జయసుధ ఈ విన్నర్స్ వాక్‌లో ఎలా దర్శనమిస్తారు? మీడియాకి ఏమైనా తన పర్సనల్ విషయాలను తెలియజేస్తారా? మళ్లీ నటించే విషయంపై ఆమె ఏమైనా స్పందిస్తారా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు వెయిట్ చేయక తప్పదు.

Leave a comment