Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

చీప్‌విప్‌,విప్ పదవులు ఎవరికో..?

Published on Nov 10 2017 // Politics

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలిలో పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

ఒకట్రెండు రోజుల్లో చీఫ్‌ విప్‌, విప్ పదవులను భర్తీ చేసే అవకాశముందని సమాచారం. ఈ పదవులపై సీనియర్లతో పాటు పలువురు నాయకులు ఆశలు పెట్టుకోవడంతో పోటీ ఎక్కువగానే ఉందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి.

అసెంబ్లీ చీఫ్‌ విప్‌ రేసులో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముందంజలో ఉన్నారు. బొండా ఉమామహేశ్వరరావు, కాగిత వెంకట్రావు కూడా ఈ పదవికి పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.

శాసనమండలి ఛైర్మన్ పదవికి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మండలి చైర్మన్‌ పదవికి ఎన్‌ఎండీ ఫరూఖ్‌ పేరును చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడంతో చీఫ్‌, మూడు విప్‌ పదవుల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు.

మండలి చీఫ్‌ విప్‌ పదవిని దక్కించుకునేందుకు టీడీ జనార్దన్‌, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, రామసుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

విప్‌ పదవి రేసులో బుద్దా వెంకన్న, బీదా రవిచంద్ర, అన్నం సతీశ్‌, అంగర రామ్మోహన్‌రావు, సంధ్యారాణి ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పదవులు ఎవరి దక్కుతాయన్న దానిపై అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది.

Leave a comment