Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

`ఒక్క‌డు మిగిలాడు` సినిమా స‌మీక్ష‌

Published on Nov 10 2017 // Movie News

స‌మ‌స్యల‌కు స‌మాధానాలుండాలి..చెప్ప‌గ‌లిగే స్థాయిలో నాయ‌కులుండాలి. అలా లేనప్పుడు పోరాటం మొద‌ల‌వుతుంది.

దాన్ని అణిచి వేయాల‌ని చూస్తే, వేర్పాటు వాదం లేదా తీవ్ర‌వాదం మొద‌ల‌వుతుంది అనే పాయింట్‌పై శ్రీలంక త‌మిళుల పోరాటం ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు అజ‌య్ అండ్రూస్ తెర‌కెక్కించిన చిత్రం `ఒక్క‌డు మిగిలాడు`. త‌మిళ పోరాటం అన‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చే వ్య‌క్తి ఎల్‌.టి.టి.ఇ నాయ‌కుడు ప్ర‌భాక‌ర‌న్‌. ఈ క్యారెక్ట‌ర్‌తో నేటి స‌మాజంలో ఓ యువ‌కుడికి లింక్ పెట్టి దర్శ‌కుడు అజ‌య్ సినిమాను రూపొందించాడు.

1990 ద‌శ‌కంలో త‌మిళుల కోసం శ్రీలంక‌లో పోరాడే నాయ‌కుడిగా, నేటి ప‌రిస్థితుల్లో స్టూడెంట్స్ కోసం పోరాడే యువ‌కుడు..ఈ రెండు పాత్ర‌ల్లో మంచు మ‌నోజ్ న‌టించ‌డం విశేషం. ప్ర‌భాక‌రన్ పాత్ర‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తున్నార‌ని తెలియ‌గానే సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. మ‌రి ఒక్క‌డు మిగిలాడు ఆ అంచ‌నాల‌ను రీచ్ అయ్యిందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ:
యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్(సూర్య‌) త‌న ప్ర‌మోష‌న్ కోసం త‌న ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్‌ను మినిష్ట‌ర్ కొడుకులకు అప్ప‌గిస్తాడు. మినిష్ట‌ర్ (మిలింద్ గునాజి) కొడుకులు ఆ అమ్మాయిల‌ను చంపేస్తారు.

చ‌నిపోయింది యూనివ‌ర్సిటీ అమ్మాయిలే కాకుండా శ‌ర‌ణార్థులు కూడా కావ‌డంతో స్టూడెంట్స్ అంద‌రూ ఏక‌మ‌వుతారు. విద్యార్థి నాయ‌కుడు సూర్య‌(మ‌నోజ్‌) ఆధ్వ‌ర్యంలో మినిష్ట‌ర్‌కు వ్య‌తిరేకంగా పోరాటం సాగిస్తారు. మినిష్ట‌ర్ త‌న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి సూర్య‌ను ఆరెస్ట్ చేయిస్తాడు.

త‌న‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఆస‌మ‌యంలో సూర్య ఉండే పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చిన కొత్త కానిస్టేబుల్ శివాజీ(పోసాని కృష్ణ‌ముర‌ళి)..సూర్య‌కు స‌హాయం చేయాల‌నుకుని త‌న గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు.

అస‌లు సూర్య ఎక్క‌డి నుండి వ‌చ్చాడు అనే పాయింట్‌తో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. సూర్య ఎవ‌రు? సూర్య‌, పీట‌ర్‌కు సంబంధం ఏమిటి? విక్ట‌ర్ ఎవ‌రు? విక్ట‌ర్‌, సూర్యకు సంబంధం ఏమిటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ
శ్రీలంక‌లోని త‌మిళుల కోసం పోరాడే నాయ‌కుడు పీట‌ర్‌గా, విద్యార్థి నాయ‌కుడు సూర్య‌గా రెండు పాత్ర‌ల‌ను మంచు మ‌నోజ్ చ‌క్క‌గా చేశాడు.

పీట‌ర్ పాత్ర హై ఇన్‌టెన్స‌న‌ల్, ఎమోష‌న‌ల్‌గాసాగితే, సూర్య పాత్ర సెటిల్డ్‌గా సాగుతుంది. రెండు పాత్ర‌ల్లో మ‌నోజ్ చ‌క్క‌టి వేరియేష‌న్‌ను చూపించాడు. పీట‌ర్ పాత్ర కోసం మ‌నోజ్ బ‌రువు పెరిగాడు. అలాగే సూర్య పాత్ర కోసం మ‌ళ్లీ బ‌రువు త‌గ్గాడు.

ఆహార్యం, హావ‌భావాల్లో కూడా చ‌క్క‌టి వేరియేష‌న్‌ను చూపాడు మ‌నోజ్‌. ఇక సినిమాలో చెప్పుకోద‌గ్గ మ‌రో పాత్ర విక్ట‌ర్‌గా న‌టించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ అండ్రూస్‌ది. సినిమాలో చాలా కీల‌క‌మైన పాత్ర‌. సెకండాఫ్ అంతా విక్ట‌ర్ పాత్ర‌పైనే సినిమా ఎక్క‌వ శాతం సాగుతుంది.

ఇక అనీషా అంబ్రోస్ జ‌ర్న‌లిస్ట్ స్వ‌ర్ణ పాత్ర‌లో క‌నిపిస్తుంది. త‌న పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త క‌న‌ప‌డ‌దు. మినిష్ట‌ర్‌గా మిలింద్ గునాజీ, ప్రొఫెస‌ర్‌గా న‌టించిన సూర్య. సీఎం పాత్ర‌లో ముర‌ళీ మోహ‌న్‌, హెల్త్ మినిష్ట‌ర్ పాత్ర‌లో సుహాసిని ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

ద‌ర్శ‌కుడు అజ‌య్ శ్రీలంక ప్ర‌భుత్వానికి, అక్క‌డి త‌మిళుల‌కు పోరాటం జ‌రిగిన‌ప్పుడు అమాయ‌క‌మైన ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బంద‌లు ప‌డ్డారు. కొంద‌రు ఇండియా వ‌చ్చేయ‌డానికి ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నారనే దానిపై బాగా రీసెర్చ్ చేసి దాని ఆధారంగా క‌థ‌ను త‌యారు చేసుకుని, ఇప్ప‌టి విద్యార్థి నాయ‌కుడు సూర్య అనే పాత్ర‌కు లింక్ పెడుతూ చ‌క్క‌గా తెర‌కెక్కించాడు.

ముఖ్యంగా సెకండాఫ్‌లో స‌ముద్రంలో వ‌చ్చే బోట్ రైడింగ్ సీన్‌, దానిలోఎమోష‌న్స్ అన్నీ ప్రేక్ష‌కుల హృద‌యాన్ని ట‌చ్ చేస్తాయి. శివ నందిగామ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు.

కోదండ‌రామ‌రాజు సినిమాటోగ్ర‌ఫీ ఎఫెక్టివ్‌గా లేదు. చాలా సీన్స్‌కు డిఐ చేసిన‌ట్లు అనిపించ‌లేదు. విద్యార్థి నాయ‌కుడి పాత్ర‌కు త‌గ్గ ఎలివేష‌న్ క‌న‌ప‌డ‌దు. ద‌ర్శ‌కుడు ఏదో అవేద‌న‌ను చెప్పాల‌నుకున్నాడని అర్థ‌మైంది కానీ..ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుందా అని చెప్ప‌లేం.

నిర్మాణ సంస్థ: పద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి., ఎన్‌.ఇ.సి
తారాగ‌ణం: మంచు మ‌నోజ్‌, అనీషా అంబ్రోస్‌, అజ‌య్ ఆండ్రూస్‌, జెన్నీఫ‌ర్‌, మిలింద్ గునాజి, సుహాసిని, పోసాని, త‌దిత‌రులు
క‌ళ: పి.ఎస్‌.వ‌ర్మ‌
ఛాయాగ్ర‌హ‌ణం: వి.కోదండ రామ‌రాజు
కూర్పు: కార్తీక శ్రీనివాస్
స్క్రీన్‌ప్లే: గోపీమోహ‌న్‌
సంగీతం: శివ నందిగామ‌
నిర్మాతలు: ఎస్‌.ఎన్‌.రెడ్డి, ల‌క్ష్మీకాంత్‌
ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ అండ్రూస్‌

Leave a comment