Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

అమెరికా, చైనాల వ్యాపార ఒప్పందాలు

Published on Nov 10 2017 // National

విలువ రూ.16.75 లక్షల కోట్లు
బీజింగ్‌లో ట్రంప్‌ రెండో రోజు పర్యటన
షి జిన్‌పింగ్‌తో విస్తృత చర్చలు
సిల్క్‌ రోడ్‌ ఫండ్‌లో అమెరికా నిధులు!
ఉత్తరకొరియాపై కుదరని సయోధ్య
బీజింగ్‌: విభేదాలను వీడి పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని అమెరికా, చైనాలు నిర్ణయించాయి. ఈ మేరకు భారీ వ్యాపార ఒప్పందాలు చేసుకున్న రెండు దేశాలు…ఉత్తర కొరియా అంశంపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి.

చైనాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గురువారం గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌లో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సుమారు రూ.16.75లక్షల కోట్ల (250 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల) విలువైన వ్యాపార ఒప్పందాలు కుదిరాయి. చైనా ఏర్పాటు చేసిన ‘సిల్క్‌ రోడ్‌ ఫండ్‌’కు అమెరికా కూడా నిధులు సమకూర్చనుందని హాంగ్‌కాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ వెల్లడించింది. ‘‘చైనాతో విస్తృత వ్యాపార బంధాన్ని కోరుకుంటున్నాం. ఆ బంధం న్యాయబద్ధమైనది, పరస్పరం ఇచ్చిపుచ్చుకునేదై ఉండాలి.

రెండు దేశాల సంబంధాల్లో, వాణిజ్యంలో చాలా కాలంగా కొనసాగుతున్న అసమతుల్యతను చైనా అధ్యక్షుడితో చర్చించా. పరిష్కారానికి గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశా’’ అని సమావేశం అనంతరం ట్రంప్‌ వెల్లడించారు. అమెరికా, చైనాలమధ్య జరుగుతున్న వ్యాపార వాణిజ్యాల్లో చైనా వాటా నాలుగింట మూడు వంతులు ఉంటుండగా, అమెరికా వాటా ఒక భాగానికే పరిమితమవుతోంది.
ఉత్తరకొరియాపై అసంపూర్తి చర్చలు
ఉగ్రవాద నిర్మూలన, దక్షిణ ఆసియాలో శాంతి, ఆఫ్గానిస్థాన్‌ పరిణామాలపై షి జిన్‌పింగ్‌, ట్రంప్‌లు చర్చించినట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చునియింగ్‌ వెల్లడించారు. అణ్వాయుధాల తయారీతో తమ మాటను ధిక్కరిస్తున్న ఉత్తరకొరియాపై గట్టి చర్యలు తీసుకోవాలన్న ట్రంప్‌ సూచనకు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ నుంచి సానుకూలమైన స్పందన రాలేదని సమాచారం.

Leave a comment