Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

విశాల్‌ డిటెక్టివ్ సినిమా స‌మీక్ష‌

Published on Nov 10 2017 // Movie News

‘పందెంకోడి’లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో గుర్తింపు ద‌క్కించుకొన్నాడు విశాల్‌. అప్ప‌ట్నుంచి అత‌ని సినిమాలు తెలుగులోనూ విడుద‌ల అవ్వ‌డం ప‌రిపాటి అయ్యింది. అడ‌పాద‌డ‌పా విజ‌యాలు అందుకొన్నాడు కూడా.

మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌తో పాటు, వైవిధ్య‌భ‌రిత స్క్రిప్టుల్ని ఎంచుకొంటూ – త‌న విల‌క్ష‌ణ‌త చూపించుకొంటూ వ‌స్తున్నాడు. ‘డిటెక్టివ్‌’ కూడా అలాంటి క‌థే!

మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం త‌మిళ‌నాట ‘తుప్ప‌రివాల‌న్‌’గా మంచి విజ‌యాన్ని అందుకొంది. ఇప్పుడు తెలుగులోనూ విడుద‌లైంది. మ‌రి… ఈ ‘డిటెక్టివ్‌’ క‌థేంటి? అత‌ను ప‌రిశోధించిన విష‌య‌మేంటి??

క‌థేంటంటే…?: అద్వైత భూష‌ణ్ (విశాల్‌) ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌. మ‌ను (ప్ర‌స‌న్న‌) త‌న స్నేహితుడు క‌మ్ అసిస్టెంట్‌. పోలీసుల‌కు సైతం లొంగ‌ని కొన్ని కేసుల్ని అద్వైత ప‌రిష్క‌రిస్తుంటాడు. ఓసారి ‘నా కుక్క‌పిల్ల‌ని ఎవ‌రో చంపేశారు అంకుల్‌… వాళ్లెవ‌రో క‌నిపెట్టండి’ అంటూ ఓ బాబు అద్వైత ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు.

అత‌ని అమాయ‌క‌త్వం, కుక్క‌పిల్ల‌పై త‌న‌కున్న ప్రేమ చూసి – ఈ కేసు ఒప్పుకొంటాడు. కుక్క‌పిల్ల‌ని ఎవ‌రు చంపారు? అనే విష‌యాన్ని క‌నుక్కొంటూ వెళ్తుంటే… అద్వైత‌కు కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ప్ర‌మాదాలుగా భ్ర‌మింప‌చేసిన కొన్ని హ‌త్య‌ల‌కు ఓ ముఠా కార‌ణ‌మ‌ని గ్ర‌హిస్తాడు. ఆ హ‌త్య‌లెవ‌రు చేశారు? వాళ్ల‌ని అద్వైత ఎలా ప‌ట్టుకొన్నాడు? అనేదే క‌థ‌.

తెర‌పై ఎలా సాగిందంటే…?: ఇలాంటి క‌థ‌లు తెలుగు ప్రేక్ష‌కుల‌కు బొత్తిగా కొత్త‌. ఓ నేర ప‌రిశోధ‌న నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఓ డిటెక్టివ్‌ న‌వ‌ల చ‌దువుతున్నంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది. త‌ర‌వాత ఏం జ‌ర‌గ‌బోతోంది? అనే ఉత్కంఠ‌త‌ను క‌లిగించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌లం అయ్యాడు.

ఓ కుక్క‌పిల్ల కేసు, దాని చుట్టూ అల్లుకొన్న హ‌త్య‌లు.. ఒక్కో ఎపిసోడ్ గ‌డుస్తున్న కొద్దీ… కొత్త కొత్త విష‌యాలు క‌నుక్కోవ‌డం, క‌థానాయ‌కుడికి స‌వాల్‌గా మార‌డం ఇవ‌న్నీ ఆక‌ట్టుకొనే అంశాలే. దాన్ని ద‌ర్శ‌కుడు న‌డిపించిన విధానం కూడా న‌చ్చుతుంది. టైటిల్స్ ప‌డిన‌ కాసేప‌టికే ఇదోదే కొత్త సినిమాలానే ఉందే అనే నిర్ణ‌యానికి వ‌స్తాడు ప్రేక్ష‌కుడు. దానికి త‌గ్గ‌ట్టు ప్ర‌తీ స‌న్నివేశాన్ని ప‌క‌డ్బందీ స్క్రీన్ ప్లేతో న‌డిపి ద‌ర్శ‌కుడు మ‌రింత ఉత్కంఠ‌త క‌లిగిస్తాడు.

సైన్స్‌, ఇంజినీరింగ్ లాంటి స‌బ్జెక్టులు తెలిసిన‌వాళ్ల‌కు ఈ సినిమా బాగా న‌చ్చుతుంది. ఈ విష‌యాల‌పై త‌గిన అవ‌గాహ‌న లేనివాళ్ల‌కు మాత్రం గంద‌ర‌గోళంగా ఉంటుంది. హ‌త్య‌లు ఎవ‌రు చేశారు, ఎందుకోసం అనేది ఓ పాత్ర‌తో చెప్పించారు. ఆ డైలాగుల్లో ఏది మిస్ అయినా మ‌రింత గంద‌ర‌గోళంగా ఉంటుంది. క‌థానాయిక (అను ఇమ్మాన్యుయేల్‌)ది చాలా చిన్న పాత్ర‌.

ఈ మాత్రం దానికి హీరోయిన్ ఎందుకు అనిపిస్తుంది. కానీ… ఆ పాత్ర‌ని ముగించేట‌ప్పుడు హీరోకి కీల‌క‌మైన క్లూ దొరికేలా చేశాడు ద‌ర్శ‌కుడు. ఇలాంటి ఎపిసోడ్ల‌లో మిస్కిన్ ప‌నిత‌నం అర్థం అవుతుంది. థ్రిల్ల‌ర్ జోన‌ర్ల‌ను, డిటెక్టివ్‌ న‌వ‌ల‌ల‌ను ఇష్ట‌ప‌డేవారికి ఈ సినిమా త‌ప్ప‌కుండా ఓ కొత్త అనుభూతి ఇస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే…?: విశాల్ కి ఇది కొత్త పాత్ర‌. చాలా సెటీల్డ్‌గా చేశాడు. త‌న న‌ట‌న కూడా న‌చ్చుతుంది. అను ఇమ్మాన్యుయేల్‌ది చిన్న పాత్రే. అమాయ‌కంగా క‌నిపించింది.

అద్వైత స్నేహితుడిగా ప్ర‌స‌న్న పాత్ర గుర్తిండిపోతుంది. ఆండ్రియా ఓ మినీ విల‌న్‌గా న‌టించింది. మిగిలిన‌వ‌న్నీ త‌మిళ మొహాలే. పెద్ద‌గా ప‌రిచ‌యం లేని న‌టులంతా. కానీ వారి వారి పాత్ర‌ల్లో ఇమిడిపోయారు.

టెక్నిక‌ల్ టీమ్ స‌పోర్ట్ ఈ సినిమాకి ప్ల‌స్ అయ్యింది. పాట‌ల్లేవు. కానీ నేప‌థ్య సంగీతం బాగా కుదిరింది. డిటెక్టివ్‌ సినిమా చూస్తున్నామ‌న్న మూడ్ ని నేప‌థ్య సంగీతం బాగా క్రియేట్ చేసింది. క‌థ‌, స్క్రీన్‌ప్లే విభాగాల్లో మిస్కిన్ ప్ర‌తిభ క‌నిపిస్తుంది. డ‌బ్బింగ్ సినిమా అయినా ఆ భావ‌న రాదు. తెలుగు సినిమాలానే అనిపిస్తుంది.
చిత్రం: డిటెక్టివ్‌
న‌టీన‌టులు: విశాల్‌.. ప్ర‌స‌న్న‌.. కె.భాగ్య‌రాజ్‌.. ఆండ్రియా జెరేమై.. అను ఇమ్మాన్యుయేల్‌.. విజ‌య్ రాయ్‌.. సిమ్ర‌న్‌.. జ‌య‌ప్ర‌కాష్‌.. జాన్ విజ‌య్ త‌దిత‌రులు
సంగీతం: అరోల్ కోరెల్లి
కూర్పు: ఎన్‌. అరుణ్‌కుమార్‌
ఛాయాగ్రహణం: కార్తీక్ వెంక‌ట్‌రామ‌న్‌
నిర్మాత: విశాల్‌
కథ, కథనం, దర్శకత్వం: మిస్కిన్
సంస్థ: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ

Leave a comment