Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ లది హిట్ కాంబినేషన్

Published on Nov 10 2017 // Movie News

తెలుగులోని అగ్రదర్శకుల జాబితాలో త్రివిక్రమ్ ఒకరు .. అగ్ర సంగీత దర్శకులలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. నిశ్శబ్దంగా .. ప్రశాంతంగా తనపని చేసుకుపోవడం త్రివిక్రమ్ స్టైల్. ఎక్కడ ఉంటే అక్కడి వాతావరణాన్ని ఉత్సాహపరచడం దేవిశ్రీ ప్రసాద్ స్టైల్.

ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘జల్సా’ .. ‘జులాయి’ .. ‘అత్తారింటికి దారేది’ .. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. కథా కథనాల పరంగానే కాకుండా, ఆడియో పరంగా కూడా ఈ సినిమాలు ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో ‘అ ఆ’ సినిమాకి సంగీత దర్శకుడిగా మిక్కీ జె. మేయర్ కి త్రివిక్రమ్ అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో దేవిశ్రీ ప్రసాద్ బిజీగా ఉండి ఉండటం అందుకు కారణం కావొచ్చని అనుకున్నారు.

ఆ తరువాత సినిమా అయిన ‘అజ్ఞాతవాసి’కి అనిరుథ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయనున్న ప్రాజెక్టుకు కూడా అనిరుథ్ నే ఎంపిక చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దేవిశ్రీప్రసాద్ మధ్య మనస్పర్థలు వచ్చి ఉండొచ్చనే గుసగుసలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతన్నది చూడాలి మరి.

Leave a comment