Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

అదిరింది సినిమా స‌మీక్ష‌

Published on Nov 09 2017 // Movie News

త‌మిళ హీరోలు చాలా మంది తెలుగు సినిమా మార్కెట్‌లో త‌మ‌కంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ర‌జ‌నీకాంత్‌, సూర్య‌, కార్తి, విక్ర‌మ్ అలా స‌క్సెస్ సాధించిన వారే. ఇప్పుడు ఆ పోటీ మ‌రీ ఎక్కువైంది. త‌మిళంలో మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో ఒక‌రైన విజ‌య్ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్లోకి రావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

అందులో భాగంగా విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన మెర్స‌ల్ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేశారు. సెన్సార్ ఆల‌స్యం కావ‌డంతో త‌మిళం కంటే తెలుగులో సినిమా లేట్‌గా విడుద‌లైంది.

అయితే ఈ లోపు త‌మిళ సినిమా మెర్స‌ల్‌పై వ‌చ్చిన వివాదాలు సినిమాకు కావాల్సినంత క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ క్రేజ్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో `అదిరింది` సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డింది. ఆ ఆస‌క్తి ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి చూద్దాం…

క‌థః
ఓ హాస్పిట‌ల్‌కు సంబంధించిన అంబులెన్స్ డ్రైవ‌ర్‌, మెడిక‌ల్ బ్రోక‌ర్‌, హెచ్‌.ఆర్‌ను ఎవ‌రో కిడ్నాప్ చేయ‌డంతో క‌థ మొద‌లవుతుంది. ఈ కేసును ర‌త్న‌వేలు(స‌త్య‌రాజ్‌)కి అప్ప‌గిస్తారు.

ఆయ‌న కేసుని శోధించి అస‌లు నేర‌స్థుడు డా.భార్గ‌వ్‌(విజ‌య్‌)గా గుర్తించి అరెస్ట్ చేస్తాడు. డా.భార్గ‌వ్ ఐదు రూపాయ‌లు మాత్ర‌మే తీసుకుని పేద‌ల‌కు వైద్యం చేస్తుంటాడు. అత‌నికి స‌మాజంలో చాలా మంచి పేరుంటుంది.

డా.భార్గ‌వ్ క‌థ చెప్ప‌డంతో అస‌లు సినిమాలోకి ఎంట‌ర్ అవుతాం. భార్గ‌వ్ ఓ సెమినార్ ప‌నిమీద పారిస్ వెళ‌తాడు. అక్క‌డే త‌న‌కు అనుపల్ల‌వి(కాజ‌ల్ అగ‌ర్వాల్‌) ప‌రిచ‌యం అవుతుంది. అను ప‌ల్ల‌వి, త‌న బాస్‌ డా.అర్జున్ జ‌కారియా(హ‌రీష్ పేర‌డీ)తో క‌లిసి వ‌స్తుంది.

భార్గ‌వ్ వైద్యుడే కాకుండా మెజీషియ‌న్ కూడా. ఓ మెజీషియ‌న్ షోలో భార్గ‌వ్.. అర్జున్‌ను, జ‌కారియాను చంపేసి పారిపోతాడు. దాంతో పోలీసులు భార్గ‌వ్‌ని ప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇండియాకు వ‌చ్చిన భార్గ‌వ్‌కి తారా(స‌మంత‌) అనే టీవీ యాంక‌ర్ ప‌రిచ‌యం అవుతుంది.

వారి మ‌ధ్య ప్రేమ పుట్టే స‌మ‌యంలో అనుకోని ఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. అస‌లు భార్గ‌వ్ మెజీషియ‌న్ ఎలా అవుతాడు? అర్జున్ జ‌కారియాను ఎందుకు చంపుతాడు? అస‌లు విజ‌య్‌, విజ‌య‌ భార్గ‌వ్‌కి, భార్గ‌వ్‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి? డా.భార్గ‌వ్‌కి, డా.డేనియ‌ల్‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

సమీక్షః
హీరో విజ‌య్ ఈ సినిమాలో త్రిపాత్రాభిన‌యం చేశాడు. తండ్రి, ఇద్ద‌రు కొడుకులుగా విజ‌య్ చూపించిన వేరియేష‌న్ చ‌క్క‌గా ఉంది. ఓ మంచి ప‌ని కోసం తండ్రి చేసే ప‌ని ఆగిపోయిన‌ప్పుడు అత‌ని ఇద్ద‌రి కొడుకులు ఏం చేస్తారనేదే ప్ర‌ధాన క‌థాంశం, డాక్ట‌ర్, మెజీషియ‌న్‌గా విజ‌య్ మంచి న‌ట‌న‌ చూపాడు. ఇక స‌మంత‌, కాజ‌ల్, నిత్యా పాత్ర‌ల్లో నిత్యా పాత్ర‌కు న‌ట‌న ప‌రంగా మంచి స్కోప్ దొరికింది.

పాత్ర‌కు త‌గిన విధంగానే నిత్యా చ‌క్క‌టి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించింది. మంచి ఎమోష‌న్స్‌ను పండించింది. ఎస్‌జె.సూర్య స్టైలిష్ విల‌న్‌గా చ‌క్క‌గా మెప్పించాడు. ఇక స‌త్య‌రాజ్‌, రాజేంద్ర‌న్, వ‌డివేలు, కోవై స‌ర‌ళ‌లు వారివారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాకు విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్కీన్‌ప్లే అందించ‌డం విశేషం. క‌థ‌లో కొత్త‌గా చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు.

అయితే స్క్రీన్‌ప్లే సినిమాను ఆస‌క్తిక‌రంగా ముందుకు తీసుకెళ్లింది. విజ‌య్ మూడు పాత్ర‌ల్లో వేరియేష‌న్‌ను ఈ స్క్రీన్‌ప్లేతో చ‌క్క‌గా ప్రెజెంట్ చేశారు. ద‌ర్శ‌కుడు అట్లీ పూర్తి క‌మ‌ర్షియ‌ల్ హంగులు, మాస్ ఎలిమెంట్స్‌తో సినిమాను తెర‌కెక్కించిన‌ తీరు బావుంది.

జీఎస్‌టీపై హీరో చెప్పే డైలాగ్స్‌కి త‌మిళంలో మంచి స్పంద‌న వ‌చ్చినా, ఇక్కడ మ్యూట్‌లో పెట్ట‌డం జ‌రిగింది. ఇదో ర‌కంగా మైన‌స్ అయ్యింద‌ని చెప్పొచ్చు. స‌మంత‌, విజ‌య్‌, రాజేంద్ర‌న్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి స్పంద‌న వ‌స్తుంది.

నాయ‌కుడు అంటే ఆషామాషీ కాదు.ఓ త‌రం పెట్టుకున్న న‌మ్మ‌కం, మా చేతులు కింద‌నే ఉంటాయ‌నుకోకు, ఎప్పుడో ఒక‌రోజు ఆకాశాన్ని అందుకుంటాయి.

ఒక మంచి ప‌ని చేస్తే ఒక‌టే తిరిగొస్తుంది. అదే చెడు చేస్తే..అది రెండుగా తిరిగొస్తాయి. నాకు చ‌చ్చి బత‌క‌డం మామూలే బ్రో.ఇలాంటి డైలాగ్స్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. కొన్ని సీన్స్‌ హార్ట్ ట‌చింగ్‌గా ఉంటాయి.

ప్ర‌స్తుతం కార్పొరేట్ హాస్పిట‌ల్స్ తీరుని చూపించిన తీరు చూస్తే భ‌య‌మేస్తుంది. ఇక పాట‌ల ప‌రంగా చూస్తే..నీ వ‌ల్లే సాంగ్ పిక్చ‌రైజేష‌న్ బావుంది. ఎ.ఆర్‌.రెహామాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేస్తుంది. విష్ణు సినిమాటోగ్ర‌ఫీ సినిమా రేంజ్‌ను పెంచింది.

ఓ మంచి మెసేజ్‌ను క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో చెప్ప‌డం వ‌ల్ల సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. అయితే ..క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో పాటు ఇలాంటి క‌థ‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఇది వ‌ర‌కే చూసేశారు. సెకండాఫ్ డ్యూరేష‌న్ ఎక్కువ‌గా ఉంది. అక్క‌డ‌క్క‌డా త‌మిళ నేటివిటీ కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డుతుంది.

నిర్మాణ సంస్థలు: తెన్నాండాల్ స్టూడియోస్ లిమిటెడ్‌, నార్త్‌స్టార్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్‌
తారాగ‌ణం: విజ‌య్‌, స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యామీన‌న్‌, వ‌డివేలు, కోవై స‌ర‌ళ‌, ఎస్‌జెసూర్య‌, స‌త్య‌రాజ్‌, రాజేంద్ర‌న్ త‌దిత‌రులు
సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
ఛాయాగ్ర‌హ‌ణం: జి.కె.విష్ణు
నిర్మాత‌లు: ఎన్‌.రామ‌స్వామి, హేమ‌రుక్మిణి
ద‌ర్శ‌క‌త్వం: అట్లీ

Leave a comment