Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

సౌదీలో మరో సంచలనం..

Published on Nov 08 2017 // National

అవినీతి ఆరోపణలు రావడంతో దర్యాప్తు కోసం ఆదివారం అరెస్టు చేసిన యువరాజులు, బడా వ్యాపార వేత్తల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను నిలుపుదల చేస్తూ బ్యాంకుల ఆదేశాలు జారీ చేశాయి.

కేవలం వ్యక్తిగత ఖాతాలను మాత్రమే నిలుపుదల చేస్తున్నామని, కంపెనీలకు సంబంధించిన లావాదేవీలను కొనసాగించవచ్చునని ప్రకటించాయి. బ్యాంకుల అనుమతితో పరిమితుల మేరకు లావీదేవీలు జరపవచ్చునని ఆదేశాలలో పేర్కొన్నారు.

యువరాజులను అరెస్టు చెయ్యడమే సంచలనమైతే అనూహ్యరీతిలో ఖాతాల స్తంభన చేయడం మరింత సంచలనంగా మారింది. సౌదీలో జరుగుతున్న వరుస పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కొద్దిరోజులుగా సౌదీఅరేబియా సంచలనాలకు వేదికగా మారింది. పారదర్శకమైన పాలనను అందించాలని భావించిన సౌదీ రాజు సాల్మాన్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సాల్మాన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ నిమిత్తం రాజకుటుంబాలకు చెందిన దాదాపు 12 మంది యువరాజులను ఆదివారం అరెస్టు చేయించారు.

అంతేకాకుండా బడా వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకున్నారు. విచారణ ఎదుర్కుంటున్న వ్యక్తుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఈ వరుస పరిణామాలు సౌదీలో సంచలనంగా మారాయి.

దేశంలో ఈ అంశాలపైనే చర్చ నడుస్తోంది. త్వరలోనే రాజుగా బాధ్యతలు స్వీకరించనున్న మహమ్మద్‌కు పాలనలో మరింత పట్టు సాధించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారని చర్చనడుస్తోంది.

ఇప్పటికే మహిళలకు కారు డ్రైవింగ్, క్రీడా మైదానాల్లో, వ్యాయామశాలల్లోకి అనుమతి ఇస్తున్నట్టు ఈ ఏడాదిలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Leave a comment