Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

మ‌హ‌న‌టిలో అక్కినేని నాగేశ్వరరావుగా విజయ్‌..?

Published on Nov 08 2017 // Movie News

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. ఈ చిత్రంలో రీల్‌ లైఫ్‌ సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు.

సమంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఆయన అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఈ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, విజయ్‌ మంచి స్నేహితులట. వీరిద్దరూ గతంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో కలిసి పనిచేశారు.

అందుకే ఈ చిత్రంలో విజయ్‌ని అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఇక సీనియర్‌ ఎన్టీఆర్‌ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇందులో అలనాటి నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్‌ సల్మాన్‌ శివాజీ గణేశన్‌ పాత్రలోనటిస్తున్నారు.

దర్శకుడు క్రిష్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి సురేశ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment