Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

సొంత నిర్మాణ సంస్థ వైపు బాల‌కృష్ణ..?

Published on Nov 07 2017 // Movie News

ఇప్ప‌టికే సీనియ‌ర్ హీరోలు అందరు సొంత నిర్మాణ సంస్థ‌లు క‌లిగి ఉండ‌గా, బాల‌య్య మాత్రం ఇంత వ‌ర‌కు అటు వైపు దృష్టి పెట్ట‌లేదు. అయితే త్వ‌ర‌లో ఆయ‌న కూడా ఓ నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ప్ర‌స్తుతం కెఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 102వ సినిమాని సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై సి.క‌ళ్యాణ్ నిర్మాణంలో చేస్తున్నాడు బాల‌కృష్ణ‌. త‌న 103వ చిత్రంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ చేయ‌నుండ‌గా, ఈ చిత్రాన్ని త‌న సొంత బేన‌ర్‌లోనే చేయాల‌ని బాల‌య్య భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే బాల‌య్య ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌కి ఏ పేరు పెడ‌తారా అని అంద‌రు ఆసక్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. త‌న తండ్రి పేరుతో నిర్మాణ సంస్థ ఉంటుందా .. అంటే ఇప్ప‌టికే క‌ళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేన‌ర్‌ని స్థాపించి విభిన్న చిత్రాల‌ని నిర్మిస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో బాల‌య్య త‌న నిర్మాణ సంస్థకి బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్ అని నామకరణం చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ని త‌న ఇంటికి ద‌గ్గ‌ర‌లో ఉండేలా, వాస్తు స‌హా అన్ని విష‌యాల‌ను చెక్ చేసుకొని బాల‌య్య ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రారంభం నాటికి ఈ ఆఫీసు ప‌నుల‌న్ని పూర్తి చేసి సిద్ధంగా ఉంచాల‌న్న‌దే బాల‌య్య ప్లాన్ అని టాక్.

Leave a comment