Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

అమెరికా వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు..

Published on Nov 03 2017 // NRI

న్యూయార్క్ ఉగ్రదాడి నుంచి తేరుకోక ముందే మరో ఘటన
ఉగ్రవాద చర్య కాదంటున్న అధికారులు

న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి అమెరికా ప్రజలు ఇంకా తేరుకోకముందే కొలరాడోలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో ఓ మహిళ సహా ముగ్గురు మృతి చెందారు.

భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ఐదుగంటల ప్రాంతంలో డెన్వర్ సబర్బన్‌లోని థోర్న్‌టన్ వాల్‌మార్ట్ స్టోర్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఒక్కసారిగా స్టోర్‌లోకి దూసుకొచ్చిన దుండగుడు తన గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడని, ఈ కాల్పుల్లో పలువురు గాయపడగా ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన ఓ మహిళ దవాఖానకు తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు విడిచింది

. కాల్పుల ఘటనలో ఒకరు పాల్గొన్నారా? లేక పలువురు వ్యక్తుల ప్రమేయం ఇందులో ఉందా? అన్న విషయం ఇంకా తేలలేదని థోర్న్‌టన్ నగర పోలీసులు తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.

. అది ఉగ్రదాడిలా అనిపించడం లేదని పోలీస్ అధికారి విక్టర్ ఎవిలా తెలిపారు. స్టోర్‌లోకి ఒక వ్యక్తి దూసుకొచ్చి, 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఆ సమయంలో నేను చెక్‌అవుట్ దగ్గర ఉన్నాను. ఒక్కసారిగా గన్ పేలిన శబ్దం వినపడడంతో అందరం ఉలిక్కిపడ్డాం.

వెనువెంటనే కాల్పులు, కేకలతో స్టోర్ దద్దరిల్లింది. కస్టమర్లు ప్రాణభయంతో ద్వారం వద్దకు పరుగులు తీశారు. నేనూ స్టోర్‌నుంచి బయటకు పరుగెత్తుకు వచ్చాను అని ప్రత్యక్షసాక్షి ఆరన్ స్టీఫెన్స్ (44) వివరించారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు.

గ్రీన్‌కార్డు జారీ మరింత కఠినం
లాటరీ పద్ధతికి స్వస్తి యోచనలో అమెరికా అధ్యక్షుడు
వలస విధానాన్ని కఠినతరం చేయాలన్న ట్రంప్
న్యూయార్క్ ఉగ్రదాడి నేపథ్యంలో నిర్ణయం
న్యూయార్క్ ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా వలస విధానాన్ని మరింత కఠినతరం చేయాలని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు.

ఇందులోభాగంగా గ్రీన్‌కార్డ్ జారీలో అనుసరిస్తున్న లాటరీ విధానం రద్దుకు ఆయన ప్రతిపాదించారు. న్యూయార్క్‌లో ఉజ్బెకిస్థాన్ జాతీయుడు సైఫుల్లో సైపోస్ ట్రక్కుదాడికి పాల్పడి 8మంది అమెరికన్లను హతమార్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న వైవిధ్యలాటరీ విధానం ద్వారానే ఉగ్రవాది సైపోవ్ అమెరికాలోకి ప్రవేశించగలిగాడని ట్రంప్ వెల్లడించారు. ప్రతిభ ఆధారిత వీసాలు, గ్రీన్‌కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.అమెరికా ప్రభుత్వం 1990లో వైవిధ్య లాటరీ విధానాన్ని ప్రారంభించింది.

దీని ద్వారా ప్రతిభావంతులు తక్కువగా ఉండే దేశాలకు చెందని ప్రజలకూ వీసాలు, గ్రీన్‌కార్డులు ఇవ్వడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఒకటీ రెండు దేశాలకు, కొన్ని జాతుల ప్రజలకే గ్రీన్‌కార్డులు పరిమితం కాకుండా వైవిధ్య తెగలకు అమెరికాలో నివసించే అవకాశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని అమెరికా చేపట్టింది.

దీని కింద లాటరీ పద్ధతిన వీసా, గ్రీన్‌కార్డు అర్హుల్ని ఎంపిక చేస్తారు. అయితే ఈ విధానం ఉగ్రవాదులు అమెరికాలో ప్రవేశించేమార్గాన్ని సులభతరం చేసిందని భావిస్తున్న ట్రంప్, ఆమేరకు రద్దు ప్రతిపాదనతో ముందుకొచ్చారు.

న్యూయార్క్‌లో నిన్న జరిగిన దాడిలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా లాటరీ విధానానికి మంగళం పలుకేందుకు చొరవ తీసుకోవాలి అని గురువారం క్యాబినెట్ సమావేశానికి ముందు ట్రంప్ మీడియాకు తెలిపారు.

ఈమేరకు లాటరీ పథకం రద్దు కోసం సత్వరమే కార్యాచరణ మొదలు పెట్టాలని కాంగ్రెస్‌ను కోరనున్నట్లు చెప్పారు. గొలుసుకట్టు వలసల్ని కూడా రద్దు చేయాలని ఆయన కోరారు.

ఒక వ్యక్తికానీ, ఉగ్రవాది కానీ అమెరికాలో ప్రవేశిస్తే, అతడి ద్వారా సగటున 23మంది అమెరికాకు రావడానికి అవకాశముందని, అలాంటి గొలుసుకట్టు వలసల్ని అంగీకరించబోమని ట్రంప్ తెలిపారు. కాగా, వలసవిధానాన్ని మరింత కఠినతరం చేయాలన్న ట్రంప్ ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది.

అతడికి మరణశిక్ష విధించండి : ట్రంప్
న్యూయార్క్‌లో ట్రక్కు దాడికి పాల్పడి, 8మంది మృతికి కారణమైన ఐఎస్ సానుభూతిపరుడు సైఫుల్లో సైపోవ్ (29) ఉగ్రవాది అని, ఆయనకు మరణశిక్షే సరైనదని తఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

పోలీసులకు పట్టుబడిన సైఫుల్లో ప్రస్తుతం తాను చికిత్స పొందుతున్న దవాఖాన గదిలో ఐఎస్ జెండాను ఉంచాలని కోరడాన్ని బట్టి ఆయన ఏ స్థాయిలో ఉన్మాదిగా మారాడో అర్థమవుతున్నదని ట్రంప్ పేర్కొన్నారు.

అతడిని వెంటనే గ్వాంటనామోబే జైలుకు పంపాలని, అలాంటి నిర్ణయమేదైనా ఉంటే, సంతకం చేసేందుకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు.మరోవైపు జరిగిన చర్యపై తానేమీ పశ్చాత్తాపపడటం లేదని సైఫుల్లో పోలీసుల విచారణలో చెప్పాడు. ఇస్లామిక్ స్టేట్ ఆరాధనలో ఉన్మాదిగా మారాడని న్యూయర్క్ పోలీసులు తెలిపారు.

Leave a comment