Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

అణుయుద్ధానికి అమెరికా స‌న్న‌ద్దం..!

Published on Nov 01 2017 // NRI

ఉత్తరకొరియాతో యుద్ధానికి దిగేందుకు అమెరికా సిద్ధమైందా? దక్షిణకొరియాతో ఉన్న స్నేహం ఆసరాగా జలాంతర్గాములు, బాంబర్లు వంటి కీలక అస్ర్తాలను ఇప్పటికే కొరియా ద్వీపకల్పానికి చేర్చిందా?..

ఇటీవలి పరిణామాలు పరిశీలిస్తే అవుననే సమాధానాలు వస్తాయి. ఉత్తర, దక్షిణ కొరియా మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా దక్షిణ కొరియాకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో 1953లో దక్షిణ కొరియా, అమెరికా మధ్య రక్షణ సహకార ఒప్పందం జరిగింది.

అప్పుడే దక్షిణ కొరియాలో అమెరికా ఆర్మీబేస్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ బేస్‌లో వివిధ రకాల ఆయుధాలు, దాదాపు 28వేల మంది సిబ్బంది ఉంటున్నారు. ఇటీవలే అమెరికా బాంబర్లు కొరియా సరిహద్దుల్లో ఎగిరిన సంగతి తెలిసిందే.

దీనికితోడు ఇటీవలే తన సబ్‌మెరైన్లను పంపినట్టు తెలుస్తున్నది. అమెరికా అణ్వస్త్ర జలాంతర్గాములు దక్షిణ కొరియాలోని బూసన్ నేవల్ బేస్‌లో ఈ ఏడాది రెండుసార్లు కనిపించాయి. ఇవి అణ్వాయుధాలను మోసుకెళ్లగలుగడంతోపాటు సీల్స్ బృందానికి ఆశ్రయ మిస్తాయి.
త్వరలో దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన పేరుతో అమెరికా తన విమాన వాహక యుద్ధనౌకలు నిమ్టిజ్, థియోడర్ రూజ్‌వెల్ట్, రోనాల్డ్ రీగన్‌ను దక్షిణ కొరియాకు పంపింది. తద్వారా భారీ సంఖ్యలో యుద్ధవిమానాలు, బలగాలు అదనంగా దక్షిణ కొరియాకు చేరినట్టే.

ట్రంప్ వచ్చినప్పుడు అదనంగా యుద్ధవిమానాలు, సైనికులు ఎలాగూ దిగుతారు. మరోవైపు ట్రంప్ ఆదేశాల మేరకు రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధకాలంలో తయారుచేయించిన బీ-52 న్యూక్లియర్ బాంబర్లను ఆధునీకరిస్తున్నట్టు ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఇటీవలే ప్రకటించారు.

ఈ పరిణామాల ఆధారంగా అమెరికా యుద్ధానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతున్నదని అవసరమైతే అణుదాడికి దిగవచ్చని నిపుణులు చెప్తున్నారు.

Leave a comment