Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ

Published on Oct 19 2017 // News

బోఫోర్స్ కుంభకోణంపై ప్రైవేట్ గూఢచారి మైఖేల్ హెర్ష్‌మామ్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాలను పరిశీలించనున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తెలిపింది.

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఫెయిర్‌ఫాక్స్ అనే ప్రైవేట్ గూఢచార సంస్థ అధ్యక్షుడైన మైఖేల్ హెర్ష్‌మామ్ వారం క్రితం జరిగిన ప్రైవేట్ గూఢచారుల సదస్సులో మాట్లాడుతూ బోఫోర్స్ కుంభకోణంలో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి అందిన ముడుపులను స్విస్ బ్యాంకు ఖాతా మోంట్ బ్లాంక్‌లో జమ చేసినట్లు కనుగొన్నట్లు చెప్పారు.

స్విస్‌బ్యాంక్‌లో ఖాతా విషయమై తమకు సమాచారం అందిందని తెలియడంతో రాజీవ్‌గాంధీ కలత చెందారని, తర్వాత దర్యాప్తును అడ్డుకున్నారని టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మైఖేల్ హెర్ష్‌మామ్ తెలిపారని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ ఇంటర్వ్యూల్లో వాస్తవాలను పరిశీలిస్తామని తెలిపారు. ఈ కేసులో భారత దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సిద్ధమని మైఖేల్ హెర్ష్‌మామ్ ఆ ఇంటర్వ్యూల్లో చెప్పారు

Leave a comment