Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌

Published on Oct 19 2017 // News

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు తెలిపినందుకు క్షమించాలని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ కోరారు.

తాను ఆ రోజున తొందరపాటుతో ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తమిళ పత్రిక వికటన్‌లో ఆయన ఓ పెద్ద క్షమాపణ శీర్షికతో రాసిన వ్యాసం బుధవారం ప్రచురితమైంది.

తొందరపాటుతో పెద్దనోట్ల రద్దును సమర్థించినందుకు తాను ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి ఉందని కమల్ పేర్కొన్నారు. ఆర్థిక శాస్త్రం తెలిసిన తన స్నేహితులు అప్పటి తన వైఖరిని చూసి విమర్శలు గుప్పించారని, అప్పుడు తనను తాను ఓదార్చుకున్నానని తెలిపారు.

పెద్దనోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని, అమలులోనే కొన్ని సమస్యలుండవచ్చని తొలుత భావించానని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో తనలో అనుమానాలు కూడా పెరుగడం ప్రారంభమైందన్నారు.

తన తప్పును అంగీకరించడం మంచి నాయకుడి లక్షణం అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ తన తప్పు అంగీకరించారని, నేటి నాయకులు కూడా తమ తప్పులను ఒప్పుకోవచ్చని సూచించారు. ప్రధాని మోదీ కూడా తన పొరపాటును అంగీకరిస్తే ఆయనకు మరోసారి సలామ్ చేస్తానని తెలిపారు.

గత ఏడాది నవంబర్ నెలలో ప్రధాని మోదీ పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినప్పుడు ఆయనకు మద్దతు తెలిపిన ప్రముఖులలో కమల్ కూడా ఉన్నారు. సెల్యూట్ మిస్టర్ మోదీ. మీ నిర్ణయాన్ని పార్టీలకతీతంగా స్వాగతించాలి.

ముఖ్యంగా నిజాయితీగా పన్ను చెల్లించేవారు హర్షించాలి అని కమల్ నాడు ట్వీట్ చేశారు. కమల్ త్వరలో రాజకీయాల్లో ప్రవేశించాలనుకుంటున్న నేపథ్యంలో పెద్దనోట్ల రద్దుపై తన వైఖరిని మార్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తన రంగు కాషాయం కాదని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. గొడ్డు మాంసంపై కేంద్రం వైఖరిని కూడా వ్యతిరేకించారు. ప్రభుత్వాలు ఏమి తినాలో చెప్పకూడదని, ప్రజలకు ఆహారాన్ని అందించాలని అన్నారు. తన 63వ పుట్టినరోజైన నవంబర్ 7న తాను ప్రారంభించబోయే కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానని గతంలో తెలిపారు.

Leave a comment