Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..

Published on Oct 19 2017 // News

నరహంతక ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ కథ దాదాపు ముగిసిపోయింది. నిన్నటి వరకు ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాదుల్లో కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోగా, మరికొందరు శరణంటూ లొంగిపోయారు.

ఐఎస్‌ రాజధానిగా చలామణి అయిన రక్కా నగరాన్ని అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. గతంలో ఐఎస్‌ ఉగ్రవాదులు కిరాతకానికి మౌనసాక్షిగా నిలిచిన అల్‌ నయీమ్‌, సిటీ సెంటర్‌ స్క్వేర్‌లలో సంకీర్ణ సేనలు జెండా పాతాయి.

రక్కాకు విముక్తి కల్పించామని అమెరికా మద్దతుతో ఐఎ్‌సపై పోరాడుతున్న సిరియా పౌర సైన్యం ఎస్డీఎఫ్‌ ప్రకటించింది. రక్కాను స్వాధీనం చేసుకునేందుకు ఎస్డీఎఫ్‌ సేనలు గత నాలుగు నెలలుగా భీకర పోరాటం చేస్తున్నాయి. ఎట్టకేలకు వారు విజయం సాధించారు.

వారి దూకుడికి తలొగ్గి సుమారు 300 మంది ఉగ్రవాదులు కుటుంబాలతోసహా లొంగిపోగా, మరో 1500 మంది ప్రాణభీతిలో నగరం వదిలి పారిపోయారు. వీరు 30 బస్సులు, 10 ట్రక్కుల్లో పరారయ్యారని స్థానికులు తెలిపారు.

ఉగ్రరాజధాని రక్కా
2014లో రక్కాను ఐఎస్‌ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఐఎస్‌ రాజధానిగా రక్కా చలామణి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఐఎస్‌ జరిపే దాడులకు ఈ నగరం నుంచే వ్యూహరచన జరుగుతుంది. ఇక్కడి నుంచే మానవహననానికి నరహంతకులు బయలుదేరేవారు.

పారిస్‌.. బ్రస్సెల్స్‌, ఇస్తాంబుల్‌.. ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దాని మూలాలు రక్కాలో ఉండేవి. ఇటు రక్కాలోనూ ఐఎస్‌ నరమేధాన్ని సాగించింది. ఇస్లాం మత నిబంధనల పేరుతో రక్కాలో ఐఎస్‌ ఉగ్రవాదులు కఠినమైన నిబంధనలు అమలు చేసేవారు. వాటిని ఉల్లంఘించిన వారిని నగర కూడళ్లలో బహిరంగంగా ఉరితీయడమో.. తలలు నరికివేయడమో చేసేవారు.

నగరంలో ఉన్న వారు తీవ్ర దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తూ వచ్చారు. తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం లేక, విద్యుత్తు సరఫరా నిలిచిపోయి, వైద్యసదుపాయాలు లేక నానా అగచాట్లు పడేవారు. 2016 నవంబరులో అమెరికా మద్దతుతో సిరియన్‌ డెమెక్రటిక్‌ ఫోర్సె్‌స(ఎస్డీఎఫ్‌) రక్కా స్వాధీనం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎట్టకేలకు విజయం సాధించాయి. మరోవైపు రష్యా మద్దతు ఉన్న సిరియా సేనలు దేశం తూర్పు భాగంలోని డైర్‌ ఎల్‌ జోర్‌ ప్రావిన్స్‌ను ఐఎస్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు.

సంఖ్యాపరంగా బలంగానే ఉంది!
ఇరాక్‌లోని మసూల్‌, సిరియాలోని రక్కా పట్టణాలపై పట్టు కోల్పోయిన తర్వాత ఇరాక్‌లోని అన్బర్‌ ప్రావిన్స్‌, సిరియాలో బౌకమాల్‌ పట్ణణానికి ఐఎస్‌ పరిమితమైంది. భౌగోళికంగా బలహీనపడినా సంఖ్యాపరంగా ఐఎస్‌ బలంగా ఉంది. ప్రస్తుతం ఇరాక్‌, సిరియాల్లో 10వేల మంది ఐఎస్‌ ఉగ్రవాదులు ఉండొచ్చని భావిస్తున్నారు.

2011లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య కన్నా ఇది 14 రెట్లు అధికం. ఐఎస్‌ అనుబంధ సంస్థలు సైతం బలంగా ఉన్నాయి. ఈజి ప్టు, లిబియాలో అవి చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉత్తర ఆఫ్రికా, ఆసియా, తూర్పు అఫ్ఘానిస్థాన్‌ల్లో ఐఎస్‌ చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తోం ది.

తాజాగా ఫిలిప్పైన్స్‌లోనూ ఐఎస్‌ మూలాలు వెలుగుచూశాయి. ఐఎస్‌ బలమైన ఉగ్ర సంస్థ అని, దానికి లక్షల్లో సానుభూతిపరులు ఉన్నారని బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సెంటర్‌ ఫర్‌ మిడిల్‌ ఈస్ట్‌ పాలసీ సీనియర్‌ ఫెలో డేనియల్‌ తెలిపారు. భౌగోళికంగా ఉనికిని కోల్పోతున్న ఐఎస్‌ ప్రత్యామ్నాయ మార్గాల్లో దాడులకు వ్యూహరచన చేస్తోంది. గెరిల్లా, లోన్‌వుల్ఫ్‌ దాడులకు ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తోంది.

పునరావాసం పెను సమస్య
రక్కాకు తిరిగి వచ్చే పౌరులకు పునరావాసం కల్పించడం ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది. ప్రస్తుతం రక్కాలో సుమారు 2 లక్షల మంది వరకు పౌరులు ఉన్నారు. మరో 2.70 లక్షల మంది నగరం విడిచి పొరుగు పట్టణాల్లో తలదాచుకుంటున్నారు. నగరం విడిచి వెళ్లిన వారంతా తిరిగి వస్తే వారికి నిలువ నీడ కూడా కరువే.

అమెరికా సంకర్ణీ సేనల వైమానిక దాడుల్లో రక్కాలో 80 శాతం పౌరుల ఆవాసాలు నేలమట్టమయ్యాయి. నగరంలో ఒక్క భవనమూ సంపూర్ణంగా కనిపించదు.

మరోవైపు రక్కాలో రహదారులు మొదలు చిన్న చిన్న ఇళ్లలో సైతం ఉగ్రవాదులు పెద్ద ఎత్తున మందుపాతరలు ఏర్పాటు చేసినట్లు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనల అధికార ప్రతినిధి కల్నల్‌ రియాన్‌ డిల్లాన్‌ తెలిపారు. ఎల్‌ఈడీ బాంబులను భవనాల్లో నేల కింద, పాత్రల్లో ఏర్పాటు చేశారన్నారు.

చివరికి పిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్‌ల్లోనూ బాంబులను పెట్టారని చెప్పారు. ఇలాంటి బాంబులు పేలి గత రెండు రోజుల్లో ముగ్గురు సంకీర్ణ సేనల సైనికులు మృతి చెందారని తెలిపారు. పేలుడు పదార్థాలను గుర్తించేందుకు నగరం మొత్తాన్ని సంకీర్ణ సేనలు జల్లెడపడుతున్నాయి.

Leave a comment