Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ఎర్రమిర్చి.. యవ్వారం

Published on Oct 17 2017 // News

01. తాజ్ మహల్ భారతీయ సంస్కృతికి ఓ కళంకం లాంటిది – అది దేశద్రోహులు నిర్మించినది – యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ …
మనకి వైజాగు – ఎర్రగడ్డలున్నట్టు – యూపీలో పెద్దగా పిచ్చాసుపత్రులు లేవనుకుంటా …?? – మాదీ ఫల రసం వాడు నాయనా గుణం కనిపిస్తుంది…!!

02. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం – కోస్తాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం …
అదేదో ప్రళయం వచ్చేస్తాదని ఊదరగొట్టేసే మైకుల మేళాలని పట్టించుకోకుండా ఎవుడు పని ఆడు చేస్కోండి – దాని పని అది చేస్కుని దాని మానాన అది పోతాది…!!

03. ఆరేళ్ళ తిరక్కుండానే అంతరిక్షంలో గతి తప్పిన చైనా స్పేస్ లాబ్ – ఈ ఏడాదో వచ్చే ఏడాదో భూమిపై కూలిపోయే ప్రమాదం …
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని – ఈడి గేరంటీ లేని సరుకులతో ఏదోరోజు అందరికీ డీ తీర్చేట్టున్నాడు- మొన్ననే ఈడ్ని తోపూ తురుమూ అంటూ భజన చేసిన ఆ ఎరుపు గాడికి చెప్పండీ ముక్క… !!

04. రష్యా సైన్యం కోసం అణు బాంబు తాకిడిని కూడా తట్టుకునేలా ఓ గడియారాన్ని తయారు చేసిన – రష్యన్ శాస్త్రవేత్తలు …
కాన్వెంట్లో చదివిస్తే కామన్ సెన్సు కాస్తా పోయిందనీ – బాంబు దెబ్బకీ మనిషనేటోడే మిగలనపుడు ఆ గడియారం ఏంచేస్కుంటార్రా సామీ ..?? – యముడొచ్చి ముహూర్తం చూస్కుంటాడా…??

05. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించే ఆలోచనలో కేంద్రం – ఒకరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా – మనోభావాలు దెబ్బతీసేలా పోష్టినా దాన్ని లైకినా షేరినా మూడేళ్ళు శిక్ష వేసే అవకాశం …
అంటే ఈ సోకాల్డ్ సోషల్ మీడియాకి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండదా…?? – దటీజ్ ఓన్లీ ఫర్ ప్రొఫెషర్ అండ్ కో కే నా…?? వాట్ ఈజ్ దిస్ భక్తాయ్ కాయ్ అద్యచ్ఛా …??

Leave a comment