Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య

Published on Oct 17 2017 // News

ఇద్దరు సాధ్వీల అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడి ప్రస్తుతం రోహ్‌తక్ లోని సునరియా జైలులో ఉంటున్న డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను ఆయన భార్య హర్జీత్ కౌర్ జైలులో కలుసుకున్నారు.

గత ఆగస్టులో గుర్మీత్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయనను హర్జీత్ కలుసుకోవడం ఇదే మొదటిసారి. హర్జీత్ వెంట కుమారుడు జస్మీత్ సింగ్ ఇన్సాన్, కుమార్తె చరణ్ ప్రీత్, అల్లుడు రౌహ్-ఎ-మీత్ కూడా జైలులో గుర్మీత్‌ను పరామర్శించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని వారు గుర్మీత్‌కు స్వీట్లు పట్టుకెళ్లారు.

జైలుకు వచ్చిన తొలినాళ్లలో ఇబ్బందులు పడినా ప్రస్తుతం రోజువారీ పనులకు గుర్మీత్ అలవాటు పడినట్టు చెబుతున్నారు. కూరగాయల సేద్యం పని అప్పగించి రోజుకు రూ.20 వేతనం ఇస్తున్నారు.

బయట విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన గుర్మీత్‌కు జైలులో రెండు పుస్తకాలు, రెండు జతల చెప్పులతో అధికారులు సరిపెట్టారు.

తనను కలుసుకునేందుకు అనుమతించాల్సిందిగా 10 మంది వ్యక్తుల జాబితాను గుర్మీత్ జైలు అధికారులకు ఇవ్వగావారిలో ఆమె వివాదాస్పద దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ కూడా ఉంది. ప్రస్తుతం హనీప్రీత్ జ్యుడిషియల్ కస్టడీలో ఉంది.

Leave a comment