Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!

Published on Oct 15 2017 // News

అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రికగా చెప్పుకునే ప్రియాంకా తనేజా అలియాస్ హనీప్రీత్ సింగ్, అంబాలాలోని కేంద్ర కర్మాగారంలో తొలిరాత్రిని నిద్రలేకుండా గడిపినట్టు తెలిసింది.

పంచకుల కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిమాండ్ ముగిసిన అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

ఇక జైల్లో తొలిరోజు ఆమె రాత్రి భోజనం స్వీకరించలేదని, ఆమెతో పాటు పట్టుబడిన సుఖ్ దీప్ కౌర్ కూడా అదే బ్యారక్ లో ఉండగా, వీరిద్దరికీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు.

అంబాలా ప్రాంతంలో డేరా మద్దతుదారులు వేలాదిగా ఉండటం, జైల్లోనూ వారికి అనుకూల వర్గాలు ఉండటంతో నిఘా పెంచామని అన్నారు. ఇతర మహిళా ఖైదీలతో వారిని కలిపి ఉంచలేదని అన్నారు.

జైలుకు తీసుకురాగానే, ఒక్కసారి తనకు గుర్మీత్ ను చూపించాలని ఆమ వేడుకుందని అధికారులు తెలిపారు.

వైద్య పరీక్షల సమయంలో తనకు ఆరోగ్యం బాగాలేదని, బీపీ పెరిగిందని ఆమె చెప్పినట్టు వెల్లడించారు. అంబాలా సివిల్ హాస్పిటల్ నుంచి వచ్చిన ముగ్గురు డాక్టర్లు రెండు గంటల పాటు హనీప్రీత్ ను పరిశీలించారని అన్నారు.

ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఒత్తిడి వల్లే రక్తపోటు పెరిగిందని డాక్టర్లు చెప్పారని జైలు అధికారి ఒకరు తెలిపారు. నిబంధనల మేరకు ఉదయం 6 గంటలకే వారిని లేపామని, ఆపై స్నానం చేసిన తరువాత టీ, రెండు బ్రెడ్ ముక్కలు ఇచ్చామని వెల్లడించారు.

Leave a comment