Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..

Published on Oct 15 2017 // News

01. నగరంలో కురిసిన భారీ వర్షాలకి రోడ్లన్నీ పాడై పోయాయి – సుమారు 78 కోట్లు విలువైన రోడ్లు నాశనం అయ్యాయి – జీహెచ్ఎంసీ కమీషనర్ …
నాసిరకం రోడ్లు పోకా తప్పదు – పోయాక సరికొత్త కాంట్రాక్టు పిలవకా తప్పదు -అనివార్యమగు ఈ విషయంపై ప్రెస్సు మీటులు రంధ్రం…!!

02. సోషల్ మీడియాలో తనపై వచ్చిన పోష్టులపై స్పందిస్తూ – ఒక అమ్మా అబ్బకి పుట్టినోళ్ళైతే అలా చేయరంటూ ఆవేదన వ్యక్తం చేసిన – వైకాపా నేత రోజా …
ఇక్కడ విచారించ వలసిన విషయమేటంటేనోలప్ప – అన్ని పార్టీల్లోనూ ఇట్టాంటి బహుమాతాపితల సంతానాలున్నాయ్ – మరి…!!

03. రాంగోపాల్ వర్మ తీయాల్సింది లక్ష్మీస్ ఎన్టీఆర్ కాదు – జగన్ 420 అని తీయాలి – తెదేపా మంత్రి జవహార్ …
ఇంకానయం – ఫ్రైడే ఫియర్ – హెల్తు డ్రింకు – వర్ధంతి శుభాకాంక్షలు – మెత్తని పరుపు మధ్యలో దీక్ష – కొత్త బూట్లు పాత యాత్రల్లాంటి టైటిల్లతో సినిమాలు తీయమనలేదు…!!

04. ఈ నెల 12 నుండి అమల్లోకి వచ్చిన కొత్త చట్టం – ఇకపై ప్రతీ ఆర్నమెంటుకీ బిఐఎస్ హాల్ మార్క్ తప్పని సరి చేసిన కేంద్రం …
మార్కెట్లో వందకీ యాభైకి హాల్ మార్క్ అచ్చేసే సెంటర్లు లచ్ఛాతొంబై ఉన్నాయిరా సామీ – ముందాటి సంగతి చూడండి – స్పురియస్ గోల్డ్ కే హాల్ మార్కేసి అమ్మేసే రకాలు తయారయ్యారు…!!

05. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రభుత్వ పాలనలో చైనా ఎంతో అభివృద్ధి చెందింది – 2008 లో ఆర్ధిక సంక్షోభాన్ని కూడా తట్టుకుని నిలబడింది – సీపీం నేత సీతారాం ఏచూరి …
మీలాంటి మహానుభావులు అక్కడ లేరనుకుంటా – అందుకే – పొద్దస్తమానం సొంత దేశం కంటే పక్క దేశపు భజనలోనే తరిస్తారు… అదేటో… !!

Leave a comment