Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు

Published on Oct 15 2017 // News

సూర్యుని వాతావరణం లేక కాంతివలయం అంత వేడిగా ఉండటానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఏడు టెలిస్కోపులు అమర్చి పంపిన ఫాక్స్‌సీ-2 రాకెట్ పంపిన వివరాలను పరిశోధకులు అధ్యయనం చేసి ఓ నిర్ధారణకు వచ్చారు. ఆ వివరాలను నేచర్ అస్ట్రానమీ అనే పత్రికలో ప్రచురించారు.

సూర్యుని ఉపరితలం కన్నా దాని వాతావరణం ఎక్కువ వేడిగా ఉండటం అంతరిక్ష పరిశోధకులకు అంతుచిక్కని మిస్టరీగా ఉండేది. దీనిపై అధ్యయనం చేయడానికి అవసరమైన పరికరాలు లేకపోవడం ఇంతకాలం లోపంగా ఉండేది.

సూర్యుడిపై నిత్యం చిన్న చిన్న పేలుళ్లు సంభవిస్తాయని, ఆ పేలుళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి వాతావరణంలో ప్రవేశించడం వల్ల అక్కడి ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని జాన్ ఎయిరోస్టేషన్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీకి చెందిన శాస్త్రవేత్తలతోపాటు ఇతర పరిశోధకులు ఇదివరకు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

అయితే సూర్యునిపై సంభవించే పేలుళ్ల కారణంగా వచ్చే మంటలను పరిశీలించే పరికరాలు లేకపోవడంతో అది ఇంతకాలం ఒక సిద్ధాంతంగా ఉండిపోయింది. తాజాగా ఫాక్స్‌సీ-2 రాకెట్ పంపిన వివరాలు పై సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాయని నేచర్ అస్ట్రానమీ పత్రిక తెలిపింది.

ఆ సిద్ధాంతాన్ని పరీక్షించేందుకు పరిశోధకులు సూర్యుని కాంతి వలయం నుంచి వెలువడుతున్న ఎక్స్‌రే ఉద్గారాలను పరిశీలించారని, అవి శక్తిమంతంగా ఉండటాన్ని కనుగొన్నారని పేర్కొంది.

Leave a comment