Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ఓదార్చిన రేణూ దేశాయ్

Published on Oct 15 2017 // News

కొంతకాలం క్రితం తనకు తీవ్రమైన జ్వరం, ‘ఆర్తో ఇమ్యూన్ కండిషన్’ సోకినప్పుడు, దాని ట్రీట్ మెంట్ కు ఎంతో కాలం పట్టడం, అదే సమయంలో గుండెలో సమస్యతో, ఇంటికీ, ఆసుపత్రికీ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న వేళ, జరిగిన ఓ ఘటన గురించి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.

తాను వేసుకున్న మాత్రల కారణంగా గాఢ నిద్రలోకి వెళ్లగా, స్కూలు నుంచి వచ్చిన తన కుమార్తె ఆద్యా, లేపేందుకు ప్రయత్నించి, విఫలమై, అమ్మ చనిపోతుందేమోనన్న ఆందోళనతో ఏడ్చేసిందని రేణూ వెల్లడించింది.

తనకు మెలకువ వచ్చేసరికి ‘‘ప్లీజ్‌ మమ్మీ, నువ్వు చచ్చిపోవద్దు ప్లీజ్‌’ అని ఒకటే ఏడుపట.

దీంతో తాను కూడా ఏడిస్తే కూతురు భయపడుతుందని భావించి, బాధను మనసులోనే దాచుకుంటూ, “నేను చనిపోనులే నీతోనే ఉంటాను. ప్రామిస్. అసలు నేను చనిపోతానని ఎందుకు అనుకుంటున్నావు? నేను చనిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు?

నీ పిల్లలను ఎవరు చూస్తారు?” అని చెప్పి ఓదార్చిందట. మమ్మీని త్వరగా తీసుకు వెళ్లవద్దని దేవుడికి దణ్ణం పెట్టుకోమని చెబితే, దేవుడి ముందు పాప ఎంత సేపు కూర్చుందో కూడా తనకు తెలియలేదని రేణూ వెల్లడించింది.

Leave a comment