Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి

Published on Sep 26 2017 // News

భారత్‌ తొలిసారిగా అంగారకుడి వద్దకు పంపిన మంగళయాన్‌ వ్యోమనౌక, అ గ్రహ కక్ష్యలో మూడేళ్లు పూర్తిచేసుకుంది. ఇది ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆ వ్యోమనౌక అందించిన శాస్త్రీయ డేటా విశ్లేషణ కొనసాగుతోందని వివరించింది. మంగళయాన్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2013 నవంబర్‌ 5న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా ప్రయోగించారు.

సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం అనంతరం ఆ వ్యోమనౌక.. 2014 సెప్టెంబర్‌ 24న విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. తద్వారా మొదటి ప్రయత్నంలోనే ఆ గ్రహం వద్దకు చేరుకున్న తొలి దేశంగా భారత్‌ ఘనత సాధించింది. కేవలం రూ.450 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టడం విశేషం.

అంగారకుడిపై ఉన్న ఖనిజాల తీరుతెన్నుల విశ్లేషణ, జీవజాలం ఉనికికి ఆధారంగా భావిస్తున్న మీథేన్‌ వాయువు ఆనవాళ్లను పట్టుకోవడం వంటి లక్ష్యాలను దీనికి నిర్దేశించారు. ఇందులో ఐదు సైన్స్‌ పరికరాలను అమర్చారు. అందులోని మార్స్‌ కలర్‌ కెమెరా (ఎంసీసీ) ద్వారా 715 ఫొటోలను తీశారు.

ఈ వ్యోమనౌకలో అనేక సంవత్సరాలకు సరిపడా ఇంధనం ఉందని 2015 జూన్‌లో ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. మంగళయాన్‌ మూడేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో 2014 సెప్టెంబర్‌ 24 నుంచి గత ఏడాది సెప్టెంబర్‌ 23 వరకూ అది సేకరించిన డేటాను ఇస్రో విడుదల చేసింది.

Leave a comment