Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

శ్రీవారి సేవకు సాధికార మండలి వూసెత్తని ప్రభుత్వం

Published on Sep 13 2017 // News

శ్రీవారి సేవకు సారథులేరి?
నాలుగు నెలలుగా ఖాళీగా తితిదే ధర్మకర్తల మండలి
సాధికార మండలి వూసెత్తని ప్రభుత్వం
అధికారులదే పెత్తనం

తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి లేదా సాధికారిక మండలి (స్పెసిఫైడ్‌ అథారిటీ) లేకుండానే ఈసారి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని మండలి పదవీకాలం ముగిసి నాలుగు నెలలు గడిచాయి.

ఆ తర్వాత కొత్త మండలిని ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. ధర్మకర్తల మండలి లేని పక్షంలో సాధికారిక మండలినైనా నియమించాలన్నది తితిదే నిబంధన. 2010 ఆగస్టులో డి.కె.ఆదికేశవులునాయుడు నేతృత్వంలోని మండలి రెండేళ్ల పదవీకాలం పూర్తి కాగానే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు జె.సత్యనారాయణ, నాగిరెడ్డి, ఐవైఆర్‌ కృష్ణారావుతో సాధికారిక మండలిని నియమించారు. దాదాపు రెండేళ్లపాటు జె.సత్యనారాయణ నేతృత్వంలోని మండలి పని చేసింది. అనంతరం కనుమూరి బాపిరాజు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి రెండు పర్యాయాలు కొలువుదీరింది.

2014లో తెదేపా అధికారంలోకి రావడంతో అప్పటి ధర్మకర్తల మండలిని ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం కొన్నాళ్లు దేవాదాయ, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శి జగదీష్‌చంద్ర శర్మ సాధికార మండలి సారథ్యంలో కొనసాగింది. తర్వాత చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలో పాలకమండలి బాధ్యతలు చేపట్టింది. తితిదే పాలన మహంతుల నుంచి 1933లో ధర్మకర్తల మండలి ఆధీనంలోకి వచ్చింది. దాదాపు 85 ఏళ్లలో ధర్మకర్తల మండలి లేదా సాధికారిక మండళ్లు కొనసాగాయి.

ప్రస్తుతం మాత్రం రెండూ లేకుండా అధికారుల పెత్తనం కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తితిదేలో నెలవారీ భారీ మొత్తంలో వివిధ కొనుగోళ్లు జరుగుతుంటాయి. దేశవిదేశాల్లోనూ ఆధ్యాత్మిక, ధార్మిక, అభివృద్ధి కార్యక్రమాలను తితిదే చేపడుతోంది. వీటన్నింటికి రెండింటిలో ఏదేని మండలి నుంచి ఆమోదముద్ర పడాల్సి ఉంది. నాలుగు నెలలుగా ఈ ప్రక్రియ లేకుండానే పనులు సాగుతున్నాయి. మండళ్ల పర్యవేక్షణ లేకుండా పరిపాలన కొనసాగుతోంది. సెప్టెంబరు 23 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అప్పటికీ మండలిని నియమించే సూచనలు కన్పించడం లేదు.
19న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఈ నెల 19న జరగనుంది. ఈ నెల 23 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభం కానున్నందున ఆలయ శుద్ధిలో భాగంగా తితిదే తిరుమంజనాన్ని నిర్వహించనుంది. ఏటా నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం రోజున ఆలయ శుద్ధిని చేపడుతుంది. ఈసారి మంగళవారం వేకువజామున 3 గంటలకు సుప్రభాతం సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుద్ధి తర్వాత ఉదయం 6 నుంచి 11 గంటల వరకు తిరుమంజనం జరుగుతుంది.

ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర తిరుమంజనాన్ని ఆలయం అంతటా పూస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన సేవను తితిదే రద్దు చేసింది.
తక్కువ ఉన్నా.. శ్రీవారి దర్శనం దూరం!
మెరుగైన నిర్వహణతోనే సులభతరం
ఈనాడు-తిరుపతి: తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు స్వామి దర్శనం గగనమవుతోంది. ధర్మదర్శనానికి తక్కువ సంఖ్యలో భక్తులున్నా మూలవిరాట్టును దర్శించుకోడానికి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. లోగడ నడక దారి భక్తులు ఎంత మంది వచ్చినా నిర్దుష్ట సమయం కేటాయిస్తూ దివ్యదర్శనం కల్పించేవారు. ఇటీవలే దివ్యదర్శనం టోకెన్లకు కోటా విధించారు.

ఆన్‌లైన్‌లో తీసుకునే ప్రత్యేక ప్రవేశ దర్శనానికీ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ రెండు దర్శనాలు పోను సర్వదర్శనానికి వేచి ఉండే భక్తులు రెండు, మూడు కంపార్ట్‌మెంట్లలోనే ఉన్నప్పటికీ మూణ్నాలుగు గంటల సమయం పడుతోంది. గతంతో పోలిస్తే ఈ వేసవి సెలవుల తర్వాత వీఐపీ సిఫార్సు లేఖల స్వీకరణను తితిదే చాలావరకు తగ్గించింది. ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే దర్శనాన్ని పరిమితం చేసింది.

ఈ క్రమంలో వేగంగా క్యూలైన్లు కదలాల్సి ఉన్నప్పటికీ గంటల కొద్దీ నిరీక్షించాల్సి రావడం విమర్శలకు తావిస్తోంది. భక్తుల సంఖ్యను సరిగా అంచనా వేయకపోవడం, త్వరితంగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెరుగైన నిర్వహణ చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.

Leave a comment