Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

అమెరికాకు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన పాక్ ?

Published on Sep 13 2017 // National

అగ్రరాజ్యం అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు మద్ధతుగా నిలిచేందుకు ఐక్యరాజ్యసమితిలో వీటో అధికారం కలిగిన చైనా, రష్యాలు సిద్ధమయ్యాయి. పాకిస్తాన్‌కు ఏ రూపంలోనైనా మద్ధతు తెలిపించేందుకు భరోసా ఇచ్చాయి.

ఇంతటిపరిణామం ఎలా జరిగిందా అనుకుంటున్నారా? అయితే ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఉగ్రవాద నిరోధ చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కుండబద్దలుకొట్టారు. పాకిస్తాన్‌ను తీవ్రంగా విమర్శించారు.

దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు, చర్చలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న పాకిస్తాన్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ద్వారా పలు ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని భావించిన పాకిస్తాన్ ఆందోళన చెందింది. ఐరాసలో వీటో అధికారం కలిగిన చైనా, రష్యాలతో పాకిస్తాన్ దౌత్యపరమైన సంప్రదింపులు జరిపింది.

దీంతో చైనా, రష్యా నుంచి పాకిస్తాన్‌కు భరోసా లభించిందని, పాకిస్తాన్ మద్ధతు తెలిపేందుకు చైనా, రష్యాలు సిద్ధంగా ఉన్నాయని పాకిస్తాన్‌లో ప్రధాన పత్రికలైన ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్, డైలీ ఎక్స్‌ప్రెస్ ఓ వార్తను ప్రచురించాయి. ఫ్రాన్స్, యూకేలను కూడా పాకిస్తాన్ సంప్రదించిందని పత్రికలు పేర్కొన్నాయి.

ఇదిలావుండగా అమెరికాపట్ల పాకిస్తాన్ ప్రధానమంత్రి అబ్బాసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌పై ఎటువంటి ఆంక్షలు విధించినా ప్రయోజనం ఉండదని, ఉగ్రవాద నిరోధానికి ప్రయత్నిస్తున్న అమెరికాకు లాభం ఉండదని ఆయన హెచ్చరించారు.

ఇటీవలే పాకిస్తాన్‌కు అమెరికా నిధుల విడుదలను నిలిపివేసింది, పాకిస్తాన్ తీరును విమర్శించింది. తాజాగా జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే పాక్, అమెరికా మధ్య దౌత్యబంధాలు క్షిణించినట్లేనని అర్థమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Leave a comment