Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

ఉ.కొరియాకు చ‌ర్య‌ల‌తో ఇర‌కాటంలో చైనా

Published on Sep 12 2017 // National

అమెరికాపై పగబట్టి ఉత్తరకొరియా చేసే పనులు చైనాకు ప్రాణసంకటంగా మారాయి. అలాగని ఆ దేశంతో స్నేహాన్ని కొనసాగించలేదూ.. వదిలించుకోలేదు.
ఉత్తర కొరియా ఇటీవల దుందుడుకు చర్యలకు పాల్పడుతూ క్షిపణి పరీక్షలు, అణు పరీక్షలు నిర్వహించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఉత్తరకొరియాకు సాయం చేస్తున్న చైనాపై గుర్రుగా ఉన్నాయి.

ఇటీవల ఉత్తరకొరియా పుంగె-రి కొండల్లోని ఒక సొరంగంలో ఏకంగా హైడ్రోజన్‌ బాంబునే పరీక్షించింది. ఫలితంగా ఆ సొరంగం కూలిపోయి, కొండ బీటలువారింది. ఇక్కడి నుంచి రేడియోధార్మిక వ్యర్థాలు వాతావరణంలో కలుస్తున్నాయని చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది. నూక్లియర్‌ వ్యర్థాలు చైనా వైపు రావడం తథ్యమని.. కానీ వాటిని ఎప్పుడు గుర్తిస్తారనేది ముఖ్యమని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరికొందరు శాస్త్రవేత్తలు ఉత్తరకొరియా పరీక్షించిన హైడ్రోజన్‌ బాంబ్‌ శక్తి అంచనాలకు మించి 250 కిలోటన్నుల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఉత్తరకొరియా సరిహద్దుల్లో వాతావరణంపై ఇప్పటికే దృష్టి పెట్టామని చైనా చెబుతోంది. ఇప్పటి వరకు ఎటువంటి న్యూక్లియర్‌ వ్యర్థాల జాడను కనుగొనలేదని చైనా పర్యావరణ మంత్రి పేర్కొన్నారు.

మరో పరీక్ష నిర్వహిస్తే..!
పుంగె-రి ప్రాంతంలో కనుక ఉత్తర కొరియా మరో అణుపరీక్షను నిర్వహిస్తే చైనా, కొరియాల్లో వేలమంది ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని అమెరికాకు చెందిన రాన్డ్‌ కార్పొరేషన్‌ అనే రక్షణ వ్యవహారాల విశ్లేషణ సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో పుంగె-రి ప్రాంతంలో అణుపరీక్షలు జరగవన్న ఎటువంటి గ్యారెంటీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో నూక్లియర్‌ లీక్‌లపై చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది.

ఆర్థికంగా ప్రభావం..
ఇప్పటికే ఉత్తరకొరియాతో వ్యాపారం చేసే ఏ దేశంతోనైనా అమెరికా వ్యాపార సంబంధాలు తెంచుకుంటుందని ఇటీవల ట్రంప్‌ హెచ్చరించారు. ఇదే జరిగితే చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. దీంతో చైనా ఎటూ చెప్పలేని స్థితిలో ఉంది.

Leave a comment