Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

రోహింగ్యా, క‌శ్మీర్ ప‌రిస్థితుల‌పై ఐరాసలో భారత్

Published on Sep 12 2017 // National

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల అధికారి తీరు దిగ్భ్రాంతికరంగా ఉందని భారతదేశం స్పష్టం చేసింది. రోహింగ్యా శరణార్థులు, జమ్మూ-కశ్మీరు పరిస్థితులపై భారతదేశ వ్యవహారశైలిపై ఐరాస మానవ హక్కుల అధికారి జీద్ రాద్ అల్ హుస్సేన్ విమర్శలు గుప్పించడంపై మండిపడింది.

జెనీవాలో జరిగిన 36వ మానవ హక్కుల మండలి సమావేశంలో జీద్ రాద్ సోమవారం మాట్లాడుతూ భారతదేశంపై విమర్శలు గుప్పించారు. దీనిపై మంగళవారం భారతదేశ రాయబారి రాజీవ్ కే చందర్ స్పందించారు. సవాళ్ళు నిండిన పరిస్థితుల్లో నిర్మితమైన శక్తిమంతమైన ప్రజాస్వామిక దేశంలో రోజూ ఆచరించే స్వేచ్ఛ, హక్కుల గురించి అపరిపూర్ణ అంచనా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.

జీద్ రాద్ సోమవారం ఈ సమావేశంలో మాట్లాడుతూ రోహింగ్యాలు తమ దేశంలో హింసను ఎదుర్కొంటున్న సమయంలో, వారిని భారతదేశం నుంచి పంపించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాధాకరమన్నారు.

రాజీవ్ చందర్ స్పందిస్తూ చాలా దేశాల మాదిరిగానే భారతదేశం కూడా అక్రమ వలసదారుల గురించి ఆందోళన చెందుతోందన్నారు. ముఖ్యంగా వారివల్ల భద్రతాపరమైన సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.

చట్టాలను అమలు చేయడాన్ని కారుణ్యం లేకపోవడంగా పొరబడకూడదన్నారు. కచ్చితత్వం లేని, ఏవో ఎంపిక చేసిన నివేదికల ఆధారంగా వివాదాస్పద తీర్పులివ్వడం సరికాదన్నారు. దీనివల్ల మానవ హక్కుల పరిస్థితుల్లో పురోగతి ఉండదని స్పష్టం చేశారు.

Leave a comment