Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

స‌త్య‌న‌ప‌ల్లిలో స్పీక‌ర్ కోడ‌ల ప‌ర్య‌ట‌న‌

Published on Sep 12 2017 // News

మూడు సంవత్సరాల క్రితం వరకూ వెనకబడిన సత్తెనపల్లి నియోజకవర్గం నేడు అభివృద్ధిలో ప్రధమ స్థానంలో దూసుకుపోతుందని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గం ముపాళ్ళ మండలంలోని రామకృష్ణపురం గ్రామంలో 31లక్షలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమం, అభివృద్ధిలో సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు.

గ్రామంలో గతంలో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించడంతో పాటు నిర్మించవలసిన సీసీ రోడ్లు, ఎన్టీఆర్ గృహలు లకు శంకుస్థాపన చేశారు.

చిన్న గ్రామమైన రామకృష్ణ పురంలో ఈ మూడు సంవత్సరాలలో సుమారు రెండుకోట్ల రూపాయల పనులు చేసుకున్నారు.

ఇళ్లు లేని పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు, శ్శశానవాటికలు, మందికి గ్యాస్, పెన్షన్లు, రుణమాఫీ, ఆర్వోప్లాంట్లు, led బల్పులు, వ్యవసాయానికి ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, ఇంకుడు గుంతలు, పంటకుంటలు ఇలా ఎన్నో చేసుకున్నామన్నారు.

గత ప్రభుత్వాలు ప్రజలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయని కాని ఈ ప్రభుత్వం అభివృద్ధే ధేయంగా పనులు చేస్తంందన్నారు.

రాష్ట్రం విడిపోయినప్పుడు లోటు బడ్జెట్ తో, కట్టుబట్టలతో మనల్ని బయటకు పంపిచారు.

అలాంటి మనం ఈ ప్రభుత్వ కృషి, పట్టుదలతో రాజధాని, పోలవరం, కృష్ణా గోదావరి కలయిక, పట్టిసీమ, 24గంటల విద్యుత్, led వెలుగులు, శ్శశానవాటికలు, గ్రామాల్లో 80శాతం రోడ్లు, గ్యాస్, ఇంకుడు గుంతలు, కార్పోరేషన్ ద్వారా రుణాలు ఇలా ఎన్నో సాధించుకున్నామన్నారు.

దేశంలో పట్టిసీమ ద్వారా కృష్ణ గోదావరి కలిపిన చరిత్ర మనకే దక్కుతుందన్నారు.

దేశంలోనే పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ఏపీని ప్రపంచ బ్యాంకు ప్రకటించిందంటే అది ఈ ప్రభుత్వం మొక్క గోప్పతనం అన్నారు.

సత్తెనపల్లి, నరసరావుపేటలలో మనం చేసుకుంటున్న అభివృద్ధి స్మశానవాటికలు, మరుగుదొడ్లు ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశం మొత్తం మనవైపు చూస్తుందన్నారు.

ప్రజలు గ్రామాల్లో విభేదాలు పక్కనపెట్టి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు ఉపయోగించుకోని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

గ్రామాల్లో ఇప్పటికే పేదలలో ఎక్కువ మందికి ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుంది. ఇంకా కావలసిన వారు ఎవ్వరైనా ఉంటే ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

గ్రామాల్లో మిగిలిన 20శాతం ఇళ్లు, రోడ్లు రానున్న 6నెలల్లో పూర్తి చేసుకుందామన్నారు.

గ్రామాల్లో రైతులు వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు భూసార పరీక్ష పత్రాలను, సబ్సిడీ ఎరువులు అందించారు.

ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన అభివృద్ధిపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల, ఎంపీపీ ఊమాదేవి, మండల నాయకులు పాపరావు ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు

Leave a comment